ఎలక్ట్రిక్ మీటర్లకు గుడ్ బై... ఇక స్మార్ట్ మీటర్లు... ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లు...

Smart Meters : డిజిటల్ టెక్నాలజీపై ఆసక్తి చూపుస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఎలక్ట్రిసిటీ మీటర్లన్నింటినీ... 2022 కల్లా స్మార్ట్ మీటర్లుగా మార్చేయబోతోంది. ఇక కరెంటు బిల్లుల స్థానంలో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ బిల్లులు రాబోతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 12:38 PM IST
ఎలక్ట్రిక్ మీటర్లకు గుడ్ బై... ఇక స్మార్ట్ మీటర్లు... ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లు...
స్మార్ట్ మీటర్లు (File)
  • Share this:
Prepaid Smart Meters : ఇండియాలో చాలా రంగాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. మరి ఎలక్ట్రిసిటీ రంగం మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉండిపోవాలి... అనుకున్న కేంద్రం... పవర్ సెక్టార్‌ని పవర్‌ఫుల్లుగా మార్చేందుకు రెడీ అవుతోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అనేది ఒకటుంది మన దేశంలో. అది ఇండియాలోని అన్ని ఎలక్ట్రిసిటీ మీటర్లనూ... స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చేయాలని డిసైడైంది. 2022 నాటికల్లా ఈ పని అయిపోవాలని టార్గెట్ పెట్టుకుంది. దేశమంతా 24 గంటలూ ఎలక్ట్రిసిటీ అందాలనీ, ఒకటే పవర్ గ్రిడ్ ఉండాలనీ కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్‌లో నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వెయ్యాలంటే... స్మార్ట్ మీటర్లను తేవడమే బెటరన్న వాదన వినిపించింది. స్మార్ట్ మీటర్ల వల్ల... మీటర్లతో మనుషులకు పని తగ్గుతుంది. వాటి మీటర్‌ను చెక్ చెయ్యడం, బిల్లు వెయ్యడం, మనీ కలెక్ట్ చెయ్యడం వంటి పనులు ఇకపై ఉండవు. స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు ఎంతో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు, ఎంత కరెంటు వాడుతున్నదీ క్షణాల్లో తెలిసిపోతుంది. ఎంత కరెంటు వాడుకోవాలో... అంతకు సరిపడా ముందే ప్రీపెయిడ్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్‌పెయిడ్ విధానంలో బిల్లులు పే చెయ్యవచ్చు.

ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల... చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. దాని వల్ల డిస్కంలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వాటి వల్ల బ్యాంకింగ్ రంగంపైనా వ్యతిరేక ప్రభావం పడుతోంది. ఎలక్ట్రిసిటీ రంగంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. పైగా... వినియోగదారులు కూడా... ఎలక్ట్రిసిటీని సమర్థంగా వాడుకునేందుకు వీలవుతుంది. ఒక్కొక్కటీ రూ.6వేలు ఉండే స్మార్ట్ మీటర్లను ఉచితంగానే ఇస్తారని తెలుస్తోంది.

స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేస్తే... ప్రజలు ఏ సంస్థ నుంచీ ఎంత ఎలక్ట్రిసిటీ కొనుక్కోవాలనుకుంటున్నారో, వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌లు వేసుకుంటున్నట్లుగా... కరెంటు వాడకానికి కూడా ముందుగానే ప్రీపెయిడ్ చెల్లింపులు చేస్తారు. అందువల్ల బిల్లులు పెండింగ్ అవ్వవు అని డిస్కంలు చెబుతున్నాయి.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు