App Store: యాపిల్, గూగుల్‌కు పోటీగా ఇండియాలో కొత్త యాప్ స్టోర్

App Store | గూగుల్-పేటీఎం మధ్య వివాదం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఏకంగా ఇండియాలో కొత్త యాప్ స్టోర్ ప్రారంభించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

news18-telugu
Updated: October 2, 2020, 12:18 PM IST
App Store: యాపిల్, గూగుల్‌కు పోటీగా ఇండియాలో కొత్త యాప్ స్టోర్
App Store: యాపిల్, గూగుల్‌కు పోటీగా ఇండియాలో కొత్త యాప్ స్టోర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏదైనా యాప్ కావాలంటే ఆండ్రాయిడ్ యూజర్ అయితే గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయాలి. లేదా థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ నుంచి డౌన్‌లోడ్ చేయాలి. త్వరలో భారతదేశానికి ప్రత్యేకంగా ఓ యాప్ స్టోర్ ప్రారంభించే అవకాశముంది. కొద్ది రోజుల క్రితం సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎం యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు సంబంధించి నియమనిబంధనలను ఉల్లంఘించినందుకు ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్టు వివరణ ఇచ్చింది గూగుల్. ఆ తర్వాత కొన్ని గంటలకు ప్లేస్టోర్‌లో పేటీఎం యాప్ తిరిగి వచ్చింది. గూగుల్ తీరుపై పేటీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ యాప్‌ను తిరిగి ప్లేస్టోర్‌లోకి తీసుకొచ్చేందుకు సదరు ప్రమోషన్లను తొలగించింది పేటీఎం. అయితే గూగుల్ తమ యాప్‌ను తొలగించడంపై సాఫ్ట్‌బ్యాంక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజర్లకు హాని చేయకుండా, వారిని రక్షించేలా పాలసీలను రూపొందించామని, అందరు డెవలపర్స్‌కి ఇది వర్తిస్తుందని పేటీఎం పేరు ప్రస్తావించకుండా గూగుల్ బదులిచ్చింది. మరోవైపు ఆండ్రాయిడ్ స్టోర్‌లో యాప్స్‌లో జరిపే పేమెంట్స్‌పై 30% కమిషన్ తీసుకుంటామని గూగుల్ మరోసారి ప్రకటించిన సంగతి తెలిసిందే.

September Smartphones: సెప్టెంబర్‌లో రిలీజైన బెస్ట్ 12 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphone Under Rs 10,000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు లేటెస్ట్ మోడల్స్ ఇవే

ఈ పరిణామాలపై భారత ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి స్పందిస్తూ గూగుల్ గైడ్‌లైన్స్‌పై తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని, అయితే తమ యాప్స్ డౌన్‌లోడ్ చేసేందుకు సొంత ప్లాట్‌ఫామ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. భారత ప్రభుత్వం ఇప్పటికే మొబైల్ యాప్ స్టోర్ నిర్వహిస్తోంది. అందులో 1200 పైగా భారత ప్రభుత్వానికి చెందిన అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ యాప్ స్టోర్‌నే విస్తరించి యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చేసే దిశలో ప్రభుత్వం ఆలోచించాలని సదరు అధికారి తెలిపారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం, గూగుల్, యాపిల్ స్పందించలేదు.

Realme Narzo 20A: తక్కువ ధరలో ఫోన్ కావాలా? కాసేపట్లో రియల్‌మీ నార్జో 20ఏ సేల్



Motorola E7 Plus: ఈరోజే మోటోరోలా ఈ7 ప్లస్ సేల్... యాక్సిస్, ఐసీఐసీఐ కార్డులపై ఆఫర్స్

గూగుల్ ఎక్కువగా కమిషన్ తీసుకుంటుందన్న ఆందోళన యాప్ డెవలపర్స్‌లో ఎప్పట్నుంచో ఉన్నది. అందుకే ఎక్కువ సర్వీస్ ఛార్జీ లేకుండా లోకల్ యాప్ స్టోర్ ఉంటే బాగుంటుందని పలు ఇండియన్ స్టార్టప్స్ ఫౌండర్స్ కూడా కోరుతున్నారు. లోకల్ యాప్ స్టోర్ ఉండటం తప్పనిసరిగా అవసరం అని, మేం గూగుల్‌కు 30 శాతం ఫీజులు ఇచ్చి, కస్టమర్ల సంఖ్య పెంచేందుకు ఖర్చు చేస్తుంటే చిన్న వ్యాపారాలు ఎలా నిలదొక్కుకుంటాయని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ కో-ఫౌండర్ విశాల్ గోండాల్ అభిప్రాయపడ్డారు.
Published by: Santhosh Kumar S
First published: October 2, 2020, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading