Home /News /technology /

India Mobile Congress 2020: గుడ్ న్యూస్... జియో 5జీ సర్వీస్‌పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

India Mobile Congress 2020: గుడ్ న్యూస్... జియో 5జీ సర్వీస్‌పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

India Mobile Congress 2020: గుడ్ న్యూస్... జియో 5జీ సర్వీస్‌పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
(File Photo: Mukesh Ambani)

India Mobile Congress 2020: గుడ్ న్యూస్... జియో 5జీ సర్వీస్‌పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన (File Photo: Mukesh Ambani)

India Mobile Congress 2020 | జియో 5జీ నెట్వర్క్ ఎప్పుడొస్తుంది అని ఎదురుచూస్తున్న రిలయెన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. జియో 5జీ సర్వీస్‌పై కీలక ప్రకటన చేశారు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ.

ఇంకా చదవండి ...
  డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని, డిజిటల్ పారిశ్రామిక విప్లవంలో ప్రపంచాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉందని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఇతర ప్రముఖులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ డిజిటల్ విప్లవం గురించి మాట్లాడుతూ కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి కాలంలో భారతదేశం నిలబడటానికి, ముందడుగు వేయడానికి దేశంలోని బలమైన 4జీ నెట్వర్క్ ఎలా ఉపయోగపడిందో వివరించారు. డిజిటల్ ఫస్ట్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి గల ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధి చెందుతుందో వివరించడంతో పాటు డిజిటల్ రంగంలో ముందంజలో ఉండటానికి కావాల్సిన నాలుగు ఐడియాలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు.

  BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే

  Mahindra Car Offers: స్టాక్ క్లియరెన్స్ సేల్... మహీంద్రా కార్లపై రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్

  "ప్రస్తుతం భారతదేశంలో 30 కోట్ల మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు ఇప్పటికీ 2జీ యుగంలో చిక్కుకు పోయారు. నిరుపేదలు సైతం సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేందుకు కావాల్సిన విధానపరమైన చర్యల్ని వెంటనే తీసుకోవాలి. వాళ్లు కూడా తమ బ్యాంక్ అకౌంట్లకు ప్రత్యక్ష నగదు బదిలీ పొందగలరు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చురుగ్గా పాల్గొంటారు" అని తన మొదటి ఐడియాను పంచుకున్నారు ముఖేష్ అంబానీ.

  "డిజిటల్‌గా కనెక్ట్ అయిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీలైనంత త్వరగా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చేలా విధానపరమైన చర్యల్ని తీసుకోవడం అవసరం. దీంతో పాటు సరసమైన ధరకు, అన్ని ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావాలి. 2021 రెండో అర్థభాగం నాటికి 5జీ విప్లవంలో జియో మార్గదర్శకంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను. స్వదేశంలో అభివృద్ధి చేసిన నెట్వర్క్, హార్డ్‌వేర్, టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది. మీ విజన్ అయిన ఆత్మనిర్భర్ భారత్‌కు జియో 5జీ సర్వీస్ సాక్ష్యంగా ఉంటుంది" అని అన్నారు ముఖేష్ అంబానీ.

  Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

  రూ.5000 ఫైన్ తప్పించుకోవడానికి వెంటనే ఈ పని చేయండి

  ఇక జియో ప్లాట్‌ఫామ్స్ గురించి మాట్లాడుతూ భారతదేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆశయాలకు తమ ప్రయత్నం మద్దతుగా ఉంటుందన్నారు ముఖేష్ అంబానీ. విద్య, వైద్య, వ్యవసాయ, మౌలిక సదుపాయాల, ఆర్థిక సేవల, సరికొత్త వాణిజ్యం లాంటి రంగాల్లో వినూత్నమైన టెక్నాలజీ సేవల్ని జియో ప్లాట్‌ఫామ్స్ ఎలా అందిస్తుందో వివరించారు. "20 స్టార్టప్ పార్ట్‌నర్స్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్‌లో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను సృష్టించింది. ఇందులో ప్రతీ ఒక్కటి భారతదేశంలో సత్తా నిరూపించిన తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం కూడా అందివ్వనుంది" అని అన్నారు.

  ఇక చివరగా భారతదేశాన్ని హార్డ్‌వేర్ తయారీ హబ్‌గా మార్చాలని పిలుపునిచ్చారు ముఖేష్ అంబానీ. అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు భారతదేశంలో అడుగుపెట్టి, వారి హార్డ్‌వేర్ తయారు చేసేందుకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేస్తున్న కృషిని గుర్తు చేశారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను బలోపేతం చేయడానికి, పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. భారతదేశం ఇతర దేశాల నుండి పెద్ద ఎత్తున దిగుమతులపై ఆధారపడకూడదన్నారు. సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ పరిశ్రమగా భారతదేశ సామర్థ్యాన్ని గుర్తు చేశారు. "ఈ రంగానికి చెందినవారంతా కలిసి పనిచేస్తే, హార్డ్‌వేర్ రంగంలో భారతదేశం విజయం తథ్యం. సాఫ్ట్‌వేర్‌లో మనం సాధించిన విజయాలతో సమానంగా హార్డ్‌వేర్‌లో విజయం సాధించొచ్చు" అని వివరించారు ముఖేష్ అంబానీ.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Reliance, Reliance Industries, Reliance Jio

  తదుపరి వార్తలు