Reliance Jio: 5జీ నెట్‌వర్క్‌పై రిలయెన్స్ జియో ప్లాన్స్ ఇవే...

Reliance Jio | టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌ అంటే సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే కాదని, యాప్ డెవలపర్స్, అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్, నెట్వర్క్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, హ్యాండ్‌సెట్ మేకర్స్ లాంటివన్నీ ఈ రంగంలోకి వస్తాయని రిలయెన్స్ జియో అభిప్రాయపడింది.

news18-telugu
Updated: October 14, 2019, 12:28 PM IST
Reliance Jio: 5జీ నెట్‌వర్క్‌పై రిలయెన్స్ జియో ప్లాన్స్ ఇవే...
న్యూ ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డ్ మెంబర్ మహేంద్ర నహత, ఇతర ప్రముఖులు
news18-telugu
Updated: October 14, 2019, 12:28 PM IST
రిలయెన్స్ జియో... ఈ పేరు వింటే 4జీ నెట్‌వర్క్‌లో సృష్టించిన సంచలనాలే గుర్తొస్తాయి. ఇప్పటికీ 4జీ నెట్‌వర్క్‌లో జియోదే పైచేయి. 4జీ నెట్‌వర్క్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తున్న రిలయెన్స్ జియో ఇక 5జీ నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టింది. న్యూ ఢిల్లీలో ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019 కార్యక్రమంలో రిలయెన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌పై తన ప్రణాళికల్ని పంచుకుంది. 5జీ స్పెక్ట్రమ్ సమయానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రిలయెన్స్ జియో కోరింది. అంతేకాదు... 5జీ ధరలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డ్ మెంబర్ మహేంద్ర నహత కోరారు.

సకాలంలో 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలి. స్పెక్ట్రమ్ వేలంపాటల మధ్య ఉన్న దీర్ఘకాల ఆలస్యానికి తెరదించాలి. పరిశ్రమకు స్పెక్ట్రమ్ నిరంతరం అందుబాటులో ఉంచాలి. భారతదేశం 5జీ లీడర్‌గా ఎదగాలంటే 5జీ స్పెక్ట్రమ్ ధరలపై దృష్టిపెట్టాలి. అధిక ధరలు ఉంటే 5జీని తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.
మహేంద్ర నహత, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డ్ మెంబర్


టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌ అంటే సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే కాదని, యాప్ డెవలపర్స్, అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్, నెట్వర్క్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, హ్యాండ్‌సెట్ మేకర్స్ లాంటివన్నీ ఈ రంగంలోకి వస్తాయని రిలయెన్స్ జియో అభిప్రాయపడింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు.



గత ఐదేళ్లలో 2.5 ట్రిలియన్ ఎకానమీని సృష్టించాం. మన మొబైల్ తయారీ పరిశ్రమ ప్రపంచంలోనే రెండోది. గ్లోబల్ కంపెనీలు ఇండియాకు రావాలని ఆహ్వానిస్తున్నాం. మా దగ్గర మంచి ఎఫ్‌డీఐ పాలసీ ఉంది. డేటా సెక్యూరిటీపై కృషి చేస్తున్నాం. కొన్ని కంపెనీలకు 5జీ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చాం.
రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి


ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని అక్టోబర్ 14 నుంచి 16 వరకు ఢిల్లీలోని ఏరోసిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోంది.
Loading...
Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డబుల్ డిస్కౌంట్

Amazon Sale: అమెజాన్‌లో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్స్ ఇవే
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...