Houseparty: మీ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నారా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Houseparty App | ప్రపంచమంతా చాలాచోట్ల లాక్‌డౌన్ ఉండటంతో హౌజ్ పార్టీ యాప్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: March 31, 2020, 11:27 AM IST
Houseparty: మీ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నారా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Houseparty: మీ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నారా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా మీ ఫ్రెండ్స్‌ని కలుసుకోలేకపోతున్నారా? రోజూ గంటలు గంటలు కలిసి మాట్లాడుకునే స్నేహితులు దూరమయ్యారని ఫీల్ అవుతున్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నారా? వారిని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా టెక్నాలజీ సాయంతో నిత్యం టచ్‌లోనే ఉండొచ్చు. అనేక ప్లాట్‌ఫామ్స్, యాప్స్ మీ మధ్య దూరాన్ని తగ్గించేస్తున్నాయి. అలాంటి యాప్స్‌లో ఒకటి హౌజ్‌పార్టీ. సోషల్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసెస్‌ని అందించే ప్లాట్‌ఫామ్ ఇది. ఒకేసారి ఎనిమిది మందిని కనెక్ట్ చేస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి కనెక్ట్ కావొచ్చు. మాట్లాడుకోవచ్చు. అంతేకాదు... గేమ్స్ కూడా కలిసే ఆడొచ్చు. అంటే మీ స్నేహితులంతా ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉన్నా, ఒక్కసారి ఈ యాప్‌లో కనెక్ట్ అయ్యారంటే అందరూ మీ పక్కనే ఉన్నట్టు ఉంటుంది.

ప్రపంచమంతా చాలాచోట్ల లాక్‌డౌన్ ఉండటంతో హౌజ్ పార్టీ యాప్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. వీడియో కాల్స్ చేస్తున్నారు. గేమ్స్ కూడా ఆడుతున్నారు. అయితే కొన్ని గేమ్స్ ఆడటానికి మాత్రం డబ్బులు చెల్లించాలి. మిగతా సర్వీసెస్‌ని ఫ్రీగానే వాడుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో ఈ యాప్ ఉంది. అంతేకాదు. హౌజ్‌పార్టీ డెస్క్‌టాప్ వర్షన్ కూడా ఉంది. ఈ యాప్ ఉపయోగించేముందు ప్రైవసీ పాలసీ ఓసారి చదవాలి. ఈ యాప్ వాడాలంటే అనేక పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓసారి అవన్నీ తెలుసుకోవడం మంచిది. హౌజ్‌పార్టీ యాప్ హ్యాక్ అయిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ బయటపడలేదు.

ఇవి కూడా చదవండి:

Airtel: ఎయిర్‌‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... బెనిఫిట్స్ ఇవే

Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

Samsung Galaxy M11: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో సాంసంగ్ గెలాక్సీ ఎం11
Published by: Santhosh Kumar S
First published: March 31, 2020, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading