Home /News /technology /

INDIA IS TOP IN FACEBOOK BUG BOUNTY 2020 SS GH

Facebook Bug: ఫేస్‌బుక్ బగ్ బౌంటీ 2020లో భారత్ టాప్

Facebook Bug: ఫేస్‌బుక్ బగ్ బౌంటీ 2020లో భారత్ టాప్
(ప్రతీకాత్మక చిత్రం)

Facebook Bug: ఫేస్‌బుక్ బగ్ బౌంటీ 2020లో భారత్ టాప్ (ప్రతీకాత్మక చిత్రం)

Facebook bug bounty 2020 | ఫేస్ బుక్ బగ్ బౌంటీ ప్రొగ్రాం కింద ఈ డబ్బును అవార్డుగా అందజేసింది. పరిశోధకులు, సైబర్ సెక్యురిటీ నిపుణులు ఈ ప్లాట్ ఫామ్ తప్పులను వెతికేందుకు ప్రయత్నించి విజయం సాధించారు.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో తప్పులు వెతికి పట్టిస్తే సంస్థ ధనసహాయం అందిస్తుందనే సంగతి తెలిసిందే. గతంలో కేరళకు చెందిన ఓ ఔత్సాహికుడు రూ.8 లక్షల రివార్డు ఇచ్చింది. తాజాగా 1.98 మిలియన్ డాలర్లు(రూ.14.98 కోట్లు) బహమతిని అందించింది. అంటే ఈ సొమ్ము ఒక్కరికి కాదు. మొత్తం 107 దేశాల నుంచి ఫేస్ బుక్ లో బగ్ హంట్ చేసిన వారికి ఈ డబ్బును పంచింది. ఇందులో భారత్, ట్యూనిషియా, అమెరికా టాప్-3 దేశాలుగా గుర్తింపు తెచ్చుకుని బౌంటీని అందుకున్నట్లు ఫేస్ బుక్ ఖరారు చేసింది.

ఫేస్ బుక్ బగ్ బౌంటీ ప్రొగ్రాం


ఫేస్ బుక్ బగ్ బౌంటీ ప్రొగ్రాం కింద ఈ డబ్బును అవార్డుగా అందజేసింది. పరిశోధకులు, సైబర్ సెక్యురిటీ నిపుణులు ఈ ప్లాట్ ఫామ్ తప్పులను వెతికేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. ఈ ప్రొగ్రాం ద్వారా ఫేస్ బుక్ ను మరింత సురక్షితంగా, గోప్యతను పెంచేందుకు గాను ప్రారంభించింది. విజేతలుగా నిలిచిన వారికి ఫేస్ బుక్ సెక్యురిటీ, ఇంజినీరింగ్ బృందాలతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. "మేము వాలిడ్ రిపోర్టును స్వీకరించినపుడు అది సమర్పించినట్లు నివేదికను మాత్రమే కాకుండా సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కోడ్ అంతర్లీన ప్రాంతం వద్ద చూస్తాం. కొన్నిసార్లు భద్రతా పరంగా దర్యాప్తు చురుకుగా, గోప్యతను బాగా రక్షించడానికి సంబంధిత మెరుగుదలను కనుగొనడానికి దారితీస్తుంది" అని ఫేస్ బుక్ సెక్యూరుటీ ఇంజినీరింగ్ మేనేజర్ డాన్ గుర్ఫిన్కెల్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు.

LPG Gas Cylinder: ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందండి ఇలా

LPG Cylinder: సామాన్యులకు షాక్... భారీగా పెరిగిన సిలిండర్ ధర

ఈ ఏడాదే 17,000 రిపోర్టులు...


ఈ కార్యక్రమం 2011లో ప్రారంభించారు. ఈ ఏడాదితో పదో సంవత్సరంలో ప్రవేశించింది. ఇందుకు సంబంధించి 13,000 రిపోర్టులు వచ్చాయి. వాటిలో 6,900 మంది రివార్డు కూడా లభించింది. ఈ ఏడాది కూడా ఫేస్ బుక్ 17,000 నివేదికలను అందుకుంది. వీటిలో 1000కి పైగా నివేదికలకు బహుమతులు ఇచ్చింది. అత్యధిక బౌంటీ 80వేల డాలర్లను ప్రముఖ పరిశోధకులు సెలామెట్ హరియాంటోకు లభించింది. కంటెంట్ డెలివరీ నెట్వర్క్‌లో తక్కువ ప్రభావితం చేసే సమస్యను కనుగొన్నందుకు గాను ఈ అవార్డు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ ను వినియోగించేవారి యాక్సెస్ ను ఈ గ్లోబల్ నెటర్వ్క్ సర్వర్లు కంటెంట్‌ను డెలివరీ చేస్తాయి.

ఈ బగ్‌ను పరిష్కరించిన తర్వాత ఫేస్ బుక్ ఇంటర్నల్ పరిశోధకులు చాలా అరుదైన దృష్టాంతాన్ని కనుగొన్నారు. అధునాతనంగా ఎటాక్ చేసే వారు రిమోట్ కోడ్ అమలు చేసేందుకు అవకాశం ఉంది. ఫేస్ బుక్ తో పాటు ఇతర కంపెనీలు కూడా తమ ప్లాట్ ఫామ్ లను భద్రతగా ఉంచడానికి ఇలాంటి బౌంటీ ప్రొగ్రాంలను కలిగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భద్రతా సమస్యలను హైలెట్ చేసేందుకు స్వతంత్ర పరిశోధనకు ముందుకు వచ్చింది.

PM Kisan: రైతుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్... అప్లై చేయండి ఇలా

Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

భారత పరిశోధకులకు బౌంటీ


సెప్టెంబరులో ఉబర్ భారత సైబర్ సెక్యురటీ పరిశోధకులు ఆనంద ప్రకాశ్ హ్యాకింగ్ బగ్ ను కనుగొన్నాడు. అతడికి 6,500 డాలర్ల చెల్లించారు. ఉబర్ల ఖాతా స్వాదీనం చేసుకునే వల్నబిరిలిటీని పరిష్కరించారు. ఇది ఉబర్ భాగస్వాములు, ఉబర్ ఈట్స్ వినియోగదారులతో సహా ఇతర వినియోగదారుల ఖాతాను ఎటాక్ చేయడానికి అనుమతించింది.

అదేవిధంగా స్వతంత్ర భద్రతా పరిశోధకులు ఎహ్రాజ్ అహ్మద్ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్లో లోపాన్ని కనుగొన్నారు. ఇది ఏదైనా ఎయిర్టెల్ చందాదారుల(Subscribers) సున్నితమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే కనుగొన్నారు. వారి APIలో లోపం ఉందని అహ్మద్ చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే బగ్ గురించి తెలిపేందుకు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను ఆన్ లైన్ లో ప్రచురిచారు. ఇది ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రాం లోపాలను కనుగొనే పరిశోధకులకు అనుమతి కల్పిస్తుంది.

చెన్నైకి చెందిన సెక్యురుటీ రిసెర్చర్ లక్ష్మణ్ ముథియా ఇన్ స్టాగ్రాం, వాట్సాప్‌లో మరో బగ్(Bug) ను కనుగొన్నారు. ఇందులో ఫోటో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సేవను ఎవరైనా హ్యాక్ చేయడానికి అనుమతిస్తుంది. పాస్వర్డ్ రీసెట్ కోడ్ ను ధ్రువీకరించడానికి ఇన్ స్టాగ్రాం సర్వర్ ఉపయోగించే ఏకైక గుర్తింపును అదే ఐడీని వేర్వేరు వినియోగదారుల మల్టిపుల్(Multiple) పాస్ కోడ్ ను అభ్యర్థించడానికి ఉపయోగించవచ్చని ముథియా కనుగొన్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Facebook

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు