హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mobile Users: ఇండియా జనాభా 140 కోట్ల పైనే.. మరి ఎంత మందికి ఫోన్‌లున్నాయో తెలుసా?

Mobile Users: ఇండియా జనాభా 140 కోట్ల పైనే.. మరి ఎంత మందికి ఫోన్‌లున్నాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mobile Phones in India: భారత్‌లో మొబైల్‌ వినియోగదారులు భారీగా ఉన్నారు. ఇప్పుడు మన దేశ జనాభా దాదాపు 140 కోట్లకు పైనే అనుకుంటే.. వీరిలో 120 కోట్ల మందికి పైగా మొబైల్‌ వినియోగదారులు ఉన్నారని చెబుతోంది ఒక నివేదిక.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Mobile Users: ఇప్పుడు ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone) లేని ఇల్లు దాదాపు లేదు. స్మార్ట్‌ఫోన్ లేనివారు కనీసం ఫీచర్‌ ఫోన్‌ అయినా వాడుతున్నారు. అందుకే భారత్‌లో మొబైల్‌ వినియోగదారులు భారీగా ఉన్నారు. ఇప్పుడు మన దేశ జనాభా (India Population)  దాదాపు 140 కోట్లకు పైనే అనుకుంటే.. వీరిలో 120 కోట్ల మందికి పైగా మొబైల్‌ వినియోగదారులు ఉన్నారని చెబుతోంది ఒక నివేదిక.

దేశంలోని మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I & B Ministry) సెక్రటరీ అపూర్వ చంద్ర బుధవారం కొన్ని విషయాలు వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ‘వరల్డ్‌ మీడియా కాంగ్రెస్‌’ ఈవెంట్‌లో మాట్లాడిన అపూర్వ, ఇప్పుడు భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌లు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో చాలా తక్కువ రేట్లకే మొబైల్‌ డాటా(Internet) లభిస్తోందని, దీంతో ఇన్ఫర్మేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లను పెద్దఎత్తున వాడుతున్నారని వెల్లడించారు. మన దేశంలో మొత్తం మొబైల్ ఫోన్ల యూజర్లు 120 కోట్ల మంది ఉండగా, వారిలో 60 కోట్లమంది స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తున్నారని తెలిపారు.

* మీడియా గురించి..

ఈ కార్యక్రమంలో అపూర్వ చంద్ర మాట్లాడుతూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ను ఎంతగానో అభినందించారు. ఆతిథ్య దేశంతో భారత్‌కు చాలా పోలికలు ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మీడియా ల్యాండ్‌స్కేప్ గురించి అక్కడున్నవారికి తెలియజేసారు. మన దేశంలో ట్రెడిషనల్ మీడియా 897కుపైగా టెలివిజన్ ఛానెల్‌లను కలిగి ఉందన్నారు. వాటిలో 350కి పైగా న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయని వివరించారు. 80 వేలకు పైగా వార్తాపత్రికలు వివిధ భాషలలో ప్రింట్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల విస్తృతమైన సోషల్ మీడియా(Social Media) నుంచి సమాచారాన్ని బ్రౌజ్‌ చేసి వినియోగిస్తున్న యువత సంఖ్య నానాటికీ పెరుగుతోందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ద్వారా వార్తలు త్వరగా వ్యాప్తి చెందడం ఒకరకంగా మీడియా సెక్టార్‌కు సవాలుగా మారిందన్నారు అపూర్వ చంద్ర. వీటిలో ఎన్ని నిజమైన వార్తలు? ఎన్ని నకిలీవి అనేది తెలియడం లేదన్నారు. వీటిని కట్టుదిట్టం చేయడం ప్రభుత్వానికి సవాలుగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీటిపై సమర్థవంతంగా పనిచేసే నియంత్రణ యంత్రాంగం(Self Regulatory Mechanism) తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియా పరిధిలో ఎవరైనా ఒక సమాచారంపై ఫిర్యాదు చేస్తే దాన్ని మొదటి స్థాయిలోనే పరిష్కరించి నిజానిజాలను నిర్ధారించేలా ఈ మెకానిజం పని చేస్తుందని చెప్పారు.

First published:

Tags: Population, Smart phones, Technology