Mobile Gamers: అత్యధికంగా మొబైల్ గేమ్స్ ఆడేది ఆ నగరాల వారే.. అధ్యాయనంలో ఆసక్తికర విషయాలు

భారత దేశంలో మొబైల్ గేమ్స్ ఆడేవారిపై అధ్యాయనం నిర్వహించారు. ఈ అధ్యాయనం ఆధారంగా.. అహ్మదాబాద్ లో అత్యధికంగా మొబైల్ గేమ్స్ ఆడే వారు ఉన్నట్లు తేలింది.

news18-telugu
Updated: October 21, 2020, 4:33 PM IST
Mobile Gamers: అత్యధికంగా మొబైల్ గేమ్స్ ఆడేది ఆ నగరాల వారే.. అధ్యాయనంలో ఆసక్తికర విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ రోజుల్లో ఫోన్ లేని వారు కనిపించడం కరువైంది. మామూలు ఫోన్ల వాడకం తగ్గి స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ రకమైన గేమ్స్ కు అలవాటు పడ్డారు. పబ్జీ లాంటి గేమ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఉన్నారు. అనేక మంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఈ ఘటనలు స్మార్ట్ ఫోన్ యువతపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన డేటా సంస్థ ఓపెన్ సిగ్నల్ ఓ అధ్యాయనం నిర్వహించింది. భారత దేశంలో మొబైల్ గేమ్స్ ఆడేవారిపై ఈ అధ్యాయనం సాగింది. అయితే ఈ అధ్యాయనం విరాలను మంగళవారం ప్రచురించారు. దీని ఆధారంగా.. అహ్మదాబాద్ లో అత్యధికంగా మొబైల్ గేమ్స్ ఆడే వారు ఉన్నట్లు తేలింది. పబ్జీ లాంటి రియల్ టైం మల్టిప్లైయర్ గేమ్స్ ను ఇక్కడ అనేక మంది వాడుతున్నట్లు తేలింది. 100 మందిలో 71.7 మంది ఇక్కడ ఇలాంటి మొబైల్ గేమ్స్ ఆడుతున్నారని తేలింది.

70.1 పాయింట్లతో ఆ తర్వాత స్థానంలో నేవీ ముంబాయి ఉంది. తర్వాత స్థానాల్లో వడొదర(69.8), సూరత్(68), భోపాల్(67.8), ముంబాయి(67.8), గ్వాలియర్(67.7), ఇండోర్(67.7), తానే(65.7), రాజ్ కోట్(64.3) ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కత్తా మహానగరాలు 59.8, 61.3 మరియూ 57.2 పాయింట్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వారణాసి, తిరువనంతపురం నగరాలు 50 కన్నా తక్కువ పాయింట్లతో చివరి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ 63.1 పాయింట్లతో 13వ స్థానంలో ఉంది.

తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, డేటా ధర తక్కువ ఉండడం, ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ కూడా పెరగడంతో ఇండియాలో మొబైల్ లో ఆటలు ఆడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఓపెన్ సిగ్నల్ సంస్థ తెలిపింది. ఈ కారణాలతో టైర్-2, టైర్-3 పట్టణాలకూ మొబైల్ గేమ్ విస్తరించిందని వెల్లడించింది. మరో అంచనా ప్రకారం.. భారతదేశంలో మొబైల్ గేమ్స్ మార్కెట్ ప్రస్తుతం 1 1.1 బిలియన్ల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం నాటికి వినియోగదారుల సంఖ్య సుమారు 62 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading