హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Launch Live: 5జీ యుగంలోకి అడుగుపెట్టిన భారత్... 5జీ సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

5G Launch Live: 5జీ యుగంలోకి అడుగుపెట్టిన భారత్... 5జీ సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

5G Launch: 5జీ యుగంలోకి అడుగుపెట్టిన భారత్... 5జీ సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
(image: DD News)

5G Launch: 5జీ యుగంలోకి అడుగుపెట్టిన భారత్... 5జీ సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ (image: DD News)

5G Launch | భారతదేశం 5జీ యుగంలోకి అడుగుపెట్టింది. ఇండియాలో 5జీ సేవల్ని (5G Services) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దశలవారీగా పలు నగరాలు, పపట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభం అవుతాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతీయులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అల్‌ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని అందించే ఐదో జనరేషన్ అంటే 5జీ నెట్వర్క్ సేవలు (5G Services) ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (India Mobile Congress) 5జీ సేవల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారికంగా ప్రారంభించారు. అంతకన్నా ముందు ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ అయిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఆ తర్వాత 5జీ సేవల్ని అధికారికంగా ప్రారంభించారు. నేటి నుంచి 5జీ సేవలు పరిమిత సెక్టార్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, భారతదేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ నుంచి సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ జియో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. జియో ట్రూ 5జీ సేవలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. వైద్య రంగానికి జియో ట్రూ 5జీ సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆకాశ్ అంబానీ ప్రధాన మంత్రికి వివరించారు.

New Rules: రేపటి నుంచి 9 కొత్త రూల్స్... మీ డబ్బుపై ప్రభావం ఎంతో తెలుసుకోండి

ఇక మరో స్టాల్‌లో 5జీ నెట్వర్క్ ఉపయోగించి రిమోట్ పద్ధతిలో కారును ఎలా నడపొచ్చో తెలుసుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ . స్వయంగా స్టీరింగ్ పట్టుకొని వాహనాన్ని నడిపారు. రోబోటిక్స్, అగ్రికల్చర్ లాంటి రంగాల్లో 5జీ సేవల్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకున్నారు.

5జీ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ లాంటి సంస్థలు దీపావళికే 5జీ సేవల్ని ప్రారంభిస్తామని ప్రకటించాయి. అయితే ఈ సేవలు కొన్ని నగరాలకు మాత్రమే లభిస్తాయి. మొదట 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. దశలవారీగా 5జీ సేవలు పలు నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాయి. వచ్చే ఏడాది చివరినాటికి భారతదేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కస్టమర్లు 5జీ సేవలు వినియోగించడానికి ఎంత ఛార్జీలు చెల్లించాలన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. టెలికాం సంస్థలు టారిఫ్‌ను ప్రకటించాల్సి ఉంది.

Credit Card Rules: రేపటి నుంచి నాలుగు కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్

న్యూ ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచే 5జీ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 లో 5జీ సేవలు ఈరోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, 5g technology, Akash Ambani, Jio TRUE 5G, Mukesh Ambani, PM Narendra Modi

ఉత్తమ కథలు