హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Internet Speed: మీ మొబైల్ డౌన్‌లోడింగ్‌ స్పీడూ అంతంతమాత్రంగానే ఉందా..? కారణం ఇదే..!

Internet Speed: మీ మొబైల్ డౌన్‌లోడింగ్‌ స్పీడూ అంతంతమాత్రంగానే ఉందా..? కారణం ఇదే..!

Internet Speed: మీ మొబైల్ డౌన్‌లోడింగ్‌ స్పీడూ అంతంతమాత్రంగానే ఉందా..? కారణం ఇదే..!

Internet Speed: మీ మొబైల్ డౌన్‌లోడింగ్‌ స్పీడూ అంతంతమాత్రంగానే ఉందా..? కారణం ఇదే..!

Internet Speed: భారతదేశంలో 5జీ నెట్‌వర్క్ త్వరలో అందుబాటులోకి రానున్న తరుణంలో.. ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతోందనే వార్త ఒకటి బయటకు వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్ లో నిజాలు బయటపడ్డాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశం (India)లో 5జీ నెట్‌వర్క్ (5G Network) త్వరలో అందుబాటులోకి రానున్న తరుణంలో.. ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్‌ స్పీడ్‌ (Internet Speed) తగ్గుతోందనే వార్త ఒకటి బయటకు వచ్చింది. బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్, మొబైల్‌ డౌన్‌లోడింగ్‌ విభాగాల్లో ఇండియా ర్యాంక్ పడిపోయింది. నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్‌సైట్స్‌ ప్రొవైడర్ సంస్థ ఓక్లా.. మొబైల్, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌పై నెలవారీ ర్యాంకులను విడుదల చేస్తుంది. ఆగస్టు నెలకు సంబంధించి ఓక్లాస్‌ స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌(Ookla's Speedtest Global Index)ను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో నార్వే టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది. అక్కడ మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 122.7 Mbpsగా నమోదైంది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌లో సింగపూర్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

ఓవరాల్‌ మీడియన్‌ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌లో ఇండియా ఏడు స్థానాలు కోల్పోయింది. ఆగస్టు నెలలో ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌లో గ్లోబల్ లిస్ట్‌లో ఇండియా 78వ ర్యాంక్‌కు చేరుకున్నట్లు కొన్ని ఓక్లా నివేదిక పేర్కొంది. ఈ లిస్ట్‌లో మొత్తం 182 దేశాలు ఉన్నాయి. మీడియన్ మొబైల్ స్పీడ్‌లో గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారతదేశం 117వ స్థానాన్ని నిలుపుకుంది.

అలాగే మీడియన్ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌ 13.41 Mbps నుంచి 13.52 Mbpsకి పెరిగింది. ఓవరాల్‌ ఫిక్స్‌డ్ మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ 48.04 Mbps నుంచి 48.29కి చేరిందని ఓక్లా రిపోర్ట్ పేర్కొంది. మీడియన్‌ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌ అంతకు ముందు నెలలో 14.00 Mbps నుంచి 13.41 Mbpsకి పడిపోయినట్లు ఓక్లా స్పష్టం చేసింది.

* మొబైల్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌లో నార్వే టాప్‌

ఆగస్టు స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. బ్రెజిల్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి మెరుగైన ర్యాంక్‌ సొంతం చేసుకుంది. మొత్తం గ్లోబల్ మీడియన్ మొబైల్ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానంలో ఉంది. నార్వేలో అత్యధిక మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 122.7 Mbpsగా నమోదైంది.

ఇది కూడా చదవండి : రాజస్థాన్ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ రూ.38 లక్షల రివార్డ్.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు..

జులై నెలలో 118.42 Mbps స్పీడ్‌తో అగ్రస్థానంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆగస్టులో రెండో స్థానానికి పరిమితమైంది. ఖతార్ కూడా 114.28 Mbps మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో మూడో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా 4.15 Mbps డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌తో చివరి స్థానంలో క్యూబా ఉంది. ఆగస్టు నెలలో ప్రపంచ యావరేజ్‌ మొబైల్ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ 69.14Mbpsగా ఉందని ఓక్లా నివేదికలో వివరించింది.

* ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో సింగపూర్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌

మొత్తం గ్లోబల్ ఫిక్స్‌డ్ మీడియన్ స్పీడ్ విభాగంలో పాలస్తీనా అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. పాలస్తీనా ఏకంగా 27 స్థానాలు మెరుగుపరుచుకుంది. గ్లోబల్ ఫిక్స్‌డ్ మీడియన్ స్పీడ్‌లలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. బ్రాడ్‌బ్యాండ్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో సింగపూర్ 219.01 Mbps, చిలీ 211.43 Mbps, థాయిలాండ్ 188.75 Mbps స్పీడ్‌తో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఫిక్స్‌డ్‌ మీడియన్‌ స్పీడ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ 1.90 Mbps స్పీడ్‌తో చివరి స్థానంలో ఉంది. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఫిక్స్‌డ్‌ మీడియన్‌ స్పీడ్‌ యావరేజ్‌ను 30.79 Mbpsగా పేర్కొంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: India, Internet, Mobile, Tech news

ఉత్తమ కథలు