హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

India Chip Designing: వచ్చే ఐదేళ్లలో చిప్ డిజైన్‌పై 85,000 ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్న కేంద్రం.. ఆ వివరాలు..

India Chip Designing: వచ్చే ఐదేళ్లలో చిప్ డిజైన్‌పై 85,000 ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్న కేంద్రం.. ఆ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాని సెమీకండక్టర్ హబ్‌ (Semiconductor Hub)గా మార్చేందుకు కేంద్రం ముందడుగులు వేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) శాఖ ఇండియాలో చిప్స్ (Chips) తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

ఇంకా చదవండి ...

ఇండియాని సెమీకండక్టర్ హబ్‌ (Semiconductor Hub)గా మార్చేందుకు కేంద్రం ముందడుగులు వేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) శాఖ ఇండియాలో చిప్స్ (Chips) తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఇందుకు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 120 విద్యాసంస్థలకు సెమీకండక్టర్ డిజైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించనున్నట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ పేర్కొంది. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా వచ్చే ఐదేళ్లలో 85,000 మంది ఇంజనీర్లకు చిప్ డిజైన్‌పై ట్రైనింగ్ ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్లాన్ చేసినట్లు బుధవారం ఈ అధికారిక ప్రకటన తెలిపింది.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ చిప్స్ టు సిస్టమ్ డిజైన్ (SMDP-C2SD) కోసం ప్రత్యేక మ్యాన్‌పవర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 2021లో పైలట్ విస్తరణను చేపట్టింది. ఇందులో భాగంగా 60 విద్యా సంస్థలలోని 50,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చిప్‌లను డిజైన్ చేసేలా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) వద్ద సెంట్రలైజ్డ్ డిజైన్ సదుపాయం ప్రారంభించింది. "లీప్‌ఫ్రాగింగ్ (Leapfrogging), Meity ఇప్పుడు C-DACలోని ఇండియా చిప్ సెంటర్ సెటప్‌లో సెంట్రలైజ్డ్ చిప్ డిజైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 120 విద్యాసంస్థలలో 85,000 బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులకు చిప్ డిజైన్‌లో శిక్షణనిస్తుంది." అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 85 వేల ఇంజనీర్లు చిప్ డిజైనింగ్ నేర్చుకుంటే భారత్ సెమీకండక్టర్ పవర్‌హౌస్ గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Exam Calendar: గుడ్ న్యూస్.. ఎగ్జామ్ క్యాలెండర్-2023 విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీన ఉందో తెలుసుకోండి..


C-DAC ఇండియా చిప్ సెంటర్‌లో చిప్ డిజైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి, ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (EDA), ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (ECAD), ఐపీ కోర్ & డిజైన్ సొల్యూషన్స్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ పరిశ్రమ విక్రేతలను కేంద్రం భాగస్వామ్యం చేసుకుంటోంది. "సినాప్సిస్, కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్, సిమెన్స్ EDA, సిల్వాకో, ఇతర ప్రముఖ టూల్ విక్రేతలు, ఐపీ & డిజైన్ సొల్యూషన్ ప్రొవైడర్లు, ఫ్యాబ్ అగ్రిగేటర్‌లతో నిర్దిష్ట సహకార ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి" అని ప్రకటన పేర్కొంది.

సెమీకాన్‌ఇండియా (Semicon India) 2022 కాన్ఫరెన్స్‌ గత వారం విజయవంతంగా ముగిసింది. ఈ కాన్ఫరెన్స్‌లో ఇంటెల్, మైక్రోన్, క్వాల్‌కామ్, లామ్ రీసెర్చ్ వంటి గ్లోబల్ సెమీకండక్టర్ లీడర్లు చాలా మంది తమ భారతీయ పరిశోధన, అభివృద్ధి కేంద్రాల (Research And Development Centres) సహకారం గురించి ప్రస్తావించారు. అలాగే ఈ ఆర్&డీ కేంద్రాలు ఇప్పుడు తమ ప్రధాన కార్యాలయాల్లో అతిపెద్ద కేంద్రాలుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని చిప్ మేకింగ్ ఇంజనీర్లలో 20 శాతం మన దేశంలోనే ఉన్నారని.. సెమీకండక్టర్ డిజైన్ స్ట్రెంత్ ఇండియాలో ఎక్కువ అని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ చిప్ తయారుచేసే టాలెంటెడ్ ఇంజనీర్లను తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

First published:

Tags: 5g technology, Engineers, IT Employees, Technology

ఉత్తమ కథలు