Home /News /technology /

TIKTOK యాప్ ఎవరైనా తయారు చేయవచ్చు...అందులో డబ్బు సంపాదనే అసలైన సవాలు...నందన్ నీలేకని

TIKTOK యాప్ ఎవరైనా తయారు చేయవచ్చు...అందులో డబ్బు సంపాదనే అసలైన సవాలు...నందన్ నీలేకని

నందన్ నీలేకని (ఫైల్ చిత్రం)

నందన్ నీలేకని (ఫైల్ చిత్రం)

టిక్‌టాక్ లాంటి యాప్‌లు భారత్‌లో తయారు చేయడం తేలికే కానీ. వాటిని లాభదాయక వ్యాపారంగా మార్చడమే అతిపెద్ద సవాలని నీలేకని పేర్కొన్నారు. అసలు సోషల్ మీడియా వ్యాపారం వెనకున్న బిజినెస్ మోడల్ అర్థం చేసుకోకుండా రంగంలోకి దిగితే నష్టాలు మూటగట్టుకోవడం ఖాయమని ఆయన తెలిపారు.

ఇంకా చదవండి ...
    TIK TOK లాంటి యాప్స్ ను తయారు చేయడం భారతీయులకు చాలా సులువైన పనే అని...కానీ దాన్ని ఆదాయవనరుగా మార్చడమే అసలైన సవాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పేర్కొన్నారు. టిక్ టాక్ లాంటి యాప్‌లను భారత్‌లోనే తయారు చేయాలనే ఆలోచనకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇదే అంశంపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పందించారు. టిక్‌టాక్ లాంటి యాప్‌లు భారత్‌లో తయారు చేయడం తేలికే కానీ. వాటిని లాభదాయక వ్యాపారంగా మార్చడమే అతిపెద్ద సవాలని నీలేకని పేర్కొన్నారు. అసలు సోషల్ మీడియా వ్యాపారం వెనకున్న బిజినెస్ మోడల్ అర్థం చేసుకోకుండా రంగంలోకి దిగితే నష్టాలు మూటగట్టుకోవడం ఖాయమని ఆయన తెలిపారు. ఫేస్‌బుక్, గూగుల్ తరహాలోనే టిక్‌టాక్‌కూ కూడా అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారానే ఆదాయం పెద్ద మొత్తంలో గడిస్తాయి. కానీ గత ఏడాది కాలంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ 17 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. 3 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందింది. ఈ రెవెన్యూలో అధికభాగం చైనా, అమెరికా నుంచి వచ్చిందే అని గుర్తు చేశారు.

    అదే సమయంలో భారత్‌లో ఇంక డిజిటల్ యాడ్‌ మార్కెట్ డెవలప్ కాలేదని, అది డెవలప్ కాకుండా యాప్స్ విడుదల చేస్తే , బిజినెస్ వర్కౌట్ అవ్వడం సందేహమే అని తెలిపారు. చైనా, అమెరికాలో డిజిటల్ యాడ్ రెవెన్యూ బాగా ఉందని అందుకే ఆ తరహా యాప్స్ లాభసాటి మోడల్స్ గా మారినట్లు గుర్తు చేశారు. మన దేశంలో ఇంకా టీవీ, ప్రింట్ వేదికల్లో వచ్చే మొత్తం ప్రకటనల విలువ 9 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని. ఇందులో డిజిటల్ వేదికల్లోని యాడ్‌ల విలువ మాత్రం 3 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని తెలిపారు. అయితే ఇంకా టిక్ టాక్ లాంటి ఉత్పత్తులు ఇప్పటి దాకా మన దేశంలో పెద్దగా లాభాలను ఆర్జింలేదని గుర్తు చేశారు.

    అంతేకాదు టిక్ టాక్ కానీ, ఫేస్ బుక్, వాట్సప్ లాంటి కంపెనీలు గ్లోబల్ గా వస్తున్న రెవెన్యూ కారణంగానే అవి బతికి బట్టకట్టగలిగాయని, కేవలం ఒకే దేశ మార్కెట్ తో అవి మనుగడలో ఉండేవి కావని తెలిపారు. అయితే ఆయా సంస్థలు ఇప్పటి వరకూ కేవలం వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే వ్యూహాత్మక లక్ష్యంతోనే ఆయా మన దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని నందన్ నీలేకని తెలిపారు. ప్రస్తుతానికి భారత్‌లో వినియోగదారులను పెంచుకుని భవిష్యత్తులో లాభాలను గడించడమే ఫేస్ బుక్, బైట్ డాన్స్ సంస్థల వ్యూహమని ఆయన తెలిపారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు