Home /News /technology /

INDEPENDENCE DAY 2022 PRIME MINISTER NARENDRA MODI SAYS THE WAIT FOR 5G IS OVER AND DIGITAL INDIA WILL REACH EVERY VILLAGE SS

5G Network: 5జీ నెట్వర్క్ వచ్చేస్తోంది... గ్రామగ్రామానికి డిజిటల్ ఇండియా విస్తరణ... ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

5G Network: 5జీ నెట్వర్క్ వచ్చేస్తోంది... గ్రామగ్రామానికి డిజిటల్ ఇండియా విస్తరణ... ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
 (Image: ANI/Twitter)

5G Network: 5జీ నెట్వర్క్ వచ్చేస్తోంది... గ్రామగ్రామానికి డిజిటల్ ఇండియా విస్తరణ... ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ (Image: ANI/Twitter)

5G Network | 5జీ నెట్వర్క్ ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదని, 5జీ నెట్వర్క్ వచ్చేస్తోందని, గ్రామగ్రామానికి డిజిటల్ ఇండియా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 5జీ నెట్వర్క్ వస్తుందని ప్రకటించారు. 5జీ కోసం ఎదురుచూసే రోజులు పోయాయని, డిజిటల్ ఇండియా గ్రామగ్రామానికి విస్తరించబోతుందని ప్రధాని ప్రకటించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో గ్రామాల్లో కూడా డిజిటల్ ఆంట్రప్రెన్యూర్స్‌ని చూడబోతున్నామని అన్నారు. ప్రస్తుతం డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా భారతదేశంలో స్టార్టప్స్ పెరుగుతున్నాయని, టైర్ 2, టైర్ 3 పట్టణాల నుంచి టాలెంట్ వస్తోందని, మన సామర్థ్యాలపై మనకు నమ్మకం ఉండాలని అన్నారు.

రాబోయే సంవత్సరాల్లో 'పంచప్రాణా'లపై దృష్టి పెడతామని ప్రకటించారు. అందులో మొదటిది అభివృద్ధి చెందిన భారతదేశంగా పెద్ద సంకల్పాలతో ముందుకు సాగడం, రెండోది దాస్యానికి సంబంధించిన జాడలను తుడిచివేయడం, మూడోది మా వారసత్వాన్ని గర్వించడం, నాలుగోది ఐక్యత, బలం, ఐదవది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా పౌరుల విధులు అని అన్నారు.

Moto G62 5G: మోటోరోలా నుంచి కొత్త ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే


మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ సొల్యూషన్స్ నూతన భారతదేశ సవాళ్లను పరిష్కరిస్తామన్నారు. భారతదేశ సాంకేతికత, డిజిటల్ సాంకేతికత ప్రతి రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి ఇది సమయం అని అన్నారు. "భారతదేశ టెకేడ్ వచ్చింది. 5జీ, సెమీకండక్టర్ తయారీ, గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరించడం లాంటి వాటితో డిజిటల్ ఇండియా ద్వారా అట్టడుగు స్థాయికి విప్లవాన్ని తీసుకువస్తున్నాము" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

WhatsApp: మరో కొత్త ఫీచర్... మీ వాట్సప్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేయొచ్చు

భారతదేశ పారిశ్రామిక వృద్ధి అట్టడుగు స్థాయి నుంచి వస్తుందని, మన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు), వీధి వ్యాపారులు, సంఘటిత రంగాలలో పనిచేస్తున్న వారిని బలోపేతం చేయాలని అన్నారు. అవినీతిపై పూర్తి స్ధాయిలో పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన మోదీ, మన శక్తితో గత ఎనిమిదేళ్లలో ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ), మొబైల్ ఫోన్‌ల ద్వారా రూ.2 లక్షల కోట్ల నల్లధనాన్ని కనుగొన్నామని వివరించారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, 5g technology, Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, Pm modi, PM Narendra Modi

తదుపరి వార్తలు