ఏ సందర్భం వచ్చినా గూగుల్ తన మార్క్ డూడుల్‌తో సెలబ్రేట్ చేయడం చూస్తూనే ఉంటాం. ఆయా దేశాల పండుగలు, వేడుకలు, స్థానిక ప్రముఖులకు సంబంధించిన డూడుల్స్ రూపొందిస్తూ గూగుల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆగస్ట్ 15న భారతదేశం 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా గూగుల్ తన స్టైల్లో డూడుల్ రూపొందించి భారతీయులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటివరకు గూగుల్ రూపొందించిన డూడుల్స్‌తో పోలిస్తే ఇండిపెండెన్స్ డే డూడుల్ ప్రత్యేకంగా ఉంది. భారతదేశంలో జన్మించి కోపెన్హెగన్లో స్థిరపడ్డ గెస్ట్ ఆర్టిస్ట్ శైవాలిని కుమార్ రూపొందించిన డూడుల్ ఇది.

దేశ చరిత్రలో కీలకమైన రోజును సెలబ్రేట్ చేసే అవకాశం లభించడం భారతదేశ పౌరురాలిగా నాకు గర్వంగా ఉంది. ఇండిపెండెన్స్ డే గూగుల్ రూపొందించడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. భారతదేశంలో పుట్టిపెరిగిన నాకు దేశ ప్రగతి, అభివృద్ధికి సంబంధించిన అంశాలను గుర్తించే అవకాశం ఇచ్చింది. గూగుల్ డూడుల్ అనేక మంది చూస్తారని నాకు తెలుసు. అంటే నా అభిప్రాయాన్ని అందరితో పంచుకుంటున్నట్టే.
— శైవాలిని కుమార్, కోపెన్హెగన్లో స్థిరపడ్డ భారతదేశ కళాకారిణి
భారతదేశ సంస్కృతీసంప్రదాయాలు, పండుగలను ప్రతిబింబిస్తోంది గూగుల్ ఇండిపెండెన్స్ డే డూడుల్. ప్రజాస్వామ్యానికి గుర్తుగా పార్లమెంట్ హౌజ్, శాస్త్రసాంకేతికాభివృద్ధికి గుర్తుగా ఇస్రో మార్స్ మిషన్, మౌలిక వసతుల అభివృద్ధికి నిదర్శనంగా రైల్వే, మారుమూల గ్రామాల్లో ఇంకా పలకలపై చాక్‌పీస్‌తో రాయడం, దయాగుణాన్ని గుర్తుచేసే చేతులు, ధైర్యసాహసాలకు ప్రతిబింబంగా జాతీయ జంతువు బెంగాల్ టైగర్, స్వచ్ఛతకు చిహ్నంగా కమలం, స్వలింగ సంపర్కం నేరం కాదని కోర్టు చెప్పిన తీర్పును గుర్తు చేసే ఫ్లాగ్... ఇలా భారతీయత ఉట్టిపడే ప్రతీ అంశం గూగుల్ డూడుల్‌లో కనిపిస్తుంది.
HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?
WhatsApp Fingerprint: ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ రిలీజ్ చేసిన వాట్సప్... సెట్టింగ్స్ ఇవే
Success Tips: కొత్తవారితో మాట్లాడాలంటే భయమా? ఈ 10 టిప్స్ ఫాలో అవండిPublished by:Santhosh Kumar S
First published:August 15, 2019, 09:05 IST