INDANE GAS BHARAT GAS AND HP GAS CUSTOMERS CAN GET UP TO RS 900 CASHBACK BY BOOKING LPG GAS CYLINDER ON PAYTM SS
Gas Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర రూ.937... పేటీఎంలో రూ.900 క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా
Gas Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర రూ.937... పేటీఎంలో రూ.900 క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Gas Cylinder Cashback Offer | మీరు ఇండేన్ గ్యాస్ (Indane Gas) కస్టమరా? హెచ్‌పీ గ్యాస్ (HP Gas) వాడుతున్నారా? భారత్ గ్యాస్ (Bharat Gas) సిలిండర్ బుక్ చేస్తున్నారా? పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ (Gas Cylinder Booking) చేస్తే రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. జనవరి నుంచి ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.190.5 పెరిగింది. అంటే సుమారు రూ.200 ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ (Gas Cylinder Booking) చేయాలంటే రూ.937 చెల్లించాలి. ఇంకొన్నాళ్లలో ఎల్పీజీ గ్యాస్ (LPG Gas Cylinder)సిలిండర్ ధర రూ.1,000 దాటినా ఆశ్చర్యం లేదు. ఇలా గ్యాస్ సిలిండర్ సామాన్యులకు భారం అవుతున్న సమయంలో పేటీఎం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. పేటీఎం యాప్‌లో (Paytm) గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇలా ఒక్కసారి కాదు... మూడు నెలలపాటు క్యాష్‌బ్యాక్ (Cashback Offer) పొందొచ్చు. అంటే మొత్తం రూ.2,700 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. '3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్' పేరుతో ఈ ఆఫర్ అందిస్తోంది పేటీఎం.
పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఖచ్చితంగా రూ.900 క్యాష్‌బ్యాక్ వస్తుందని చెప్పలేం. రూ.900 లోపు ఎంతైనా క్యాష్‌బ్యాక్ రావొచ్చు. అయితే ఎంత క్యాష్‌బ్యాక్ వచ్చినా కస్టమర్లకు లాభమే. గతంలో ఈ క్యాష్‌బ్యాక్ తక్కువగా ఉండేది. కానీ క్యాష్‌బ్యాక్‌ను రూ.900 చేస్తూ కొత్త ఆఫర్ ప్రకటించింది. గతంలో మొదటిసారి బుక్ చేసినవారికి మాత్రమే క్యాష్‌బ్యాక్ వచ్చేది. ఇప్పుడు '3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్'లో మూడుసార్లు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు పేటీఎంలో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే అవకాశం కల్పిస్తోంది పేటీఎం. డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి తర్వాతి నెలలో డబ్బులు చెల్లించొచ్చు. ఇక ఇప్పటికే పేటీఎంలో గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నవారికి ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్స్ లభిస్తాయి. మరి పేటీఎంలో గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
Gas Cylinder Booking on Paytm: పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి ఇలా
Step 1- ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. Step 2- హోమ్ స్క్రీన్‌లో Book Gas Cylinder ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. Step 3- ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. Step 4- సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. Step 5- ఓసారి వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి. Step 6- పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. Step 7- పేమెంట్ పూర్తి చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.
ట్రాకింగ్ ద్వారా స్టేటస్ చెక్ చేయొచ్చు. Step 8- స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.