హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Shreyas Iyer చేతిపై ఉన్న స్టిక్కర్ కు ఇంత కథ ఉందా.! దాని గురించి నిజాలు తెలిస్తే మీరు నోళ్లు వెల్లబెట్టాల్సిందే.!

Shreyas Iyer చేతిపై ఉన్న స్టిక్కర్ కు ఇంత కథ ఉందా.! దాని గురించి నిజాలు తెలిస్తే మీరు నోళ్లు వెల్లబెట్టాల్సిందే.!

శ్రేయస్ అయ్యర్ (PC : TWITTER)

శ్రేయస్ అయ్యర్ (PC : TWITTER)

Shreyas Iyer :  శ్రేయస్ అయ్యర్‌ ఆటను మీరు ఫాలో అవుతుంటూ. అతని చేతిపై 'K' గుర్తుతో ఉన్న బ్లాక్ కలర్ స్టిక్కర్‌ను మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు. నిజానికి ఇది జస్ట్ ఓ స్టిక్కర్ మాత్రమే కాదు. ఆ స్టిక్కర్‌కి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎలాంటి సంబంధమూ లేదు.

ఇంకా చదవండి ...

Shreyas Iyer: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) బ్యాట్ పట్టాడంటే మైదానంలో పరుగుల వరద కనిపించాల్సిందే. అందుకే ఎప్పుడూ ఈ రైజింగ్ స్టార్ బ్యాటింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. అయితే ఈసారి మాత్రం అతని కుడి చేతిపై కనిపిస్తున్న ఒక స్టిక్కర్ (Sticker) చర్చనీయాంశం అయింది.  శ్రేయస్ అయ్యర్‌ ఆటను మీరు ఫాలో అవుతుంటూ. అతని చేతిపై 'K' గుర్తుతో ఉన్న బ్లాక్ కలర్ స్టిక్కర్‌ను మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు. నిజానికి ఇది జస్ట్ ఓ స్టిక్కర్ మాత్రమే కాదు. ఆ స్టిక్కర్‌కి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. ఇది ఒక ఖరీదైన ఫిట్‌నెస్ గ్యాడ్జెట్ (Expensive Fitness Gadget). దీనిని అల్ట్రాహ్యూమన్ అనే బెంగుళూరు స్టార్టప్ తయారుచేసింది.

ఇటీవల అల్ట్రాహ్యూమన్ సంస్థ అయ్యర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌లో భాగంగా అల్ట్రాహ్యూమన్ ఎం1 (M1) అనే ప్రొడక్ట్‌ను అయ్యర్‌ వాడుతూ దాని గురించి ప్రచారం చేస్తున్నాడు. ఈ గ్యాడ్జెట్ అల్ట్రాహ్యూమన్ (Ultrahuman) అనే ఐఫోన్ యాప్‌తో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత రియల్-టైమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్‌గా పనిచేస్తుంది. కంటిన్యూగా మానిటర్‌ చేసే ఈ కె-స్టిక్కర్ లేదా గ్యాడ్జెట్ గురించి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ టైమ్‌లైన్‌లలో కూడా కంపెనీ ప్రచారం చేయనుంది. మరికొద్ది రోజుల్లో మరింత మంది సెలబ్రెటీలు ఈ ‘కె’ స్టిక్కర్‌ను ధరించి ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది.

ఆరోగ్య వివరాలను అందించడానికి ఈ గ్యాడ్జెట్ రక్తంలో గ్లూకోజ్, ఇతర అధునాతన బయోమార్కర్లను ట్రాక్ చేయడం ద్వారా ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతుంది. అల్ట్రాహుమాన్ డెవలప్ చేసిన ఈ M1 లేదా 'K' స్టిక్కర్‌లో చేతికి ధరించాల్సిన ఒక బయో సెన్సార్ ఉంటుంది. ఈ బయోసెన్సర్ మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను రీడ్ చేస్తుంది. ఇలా రీడ్ చేసిన సమాచారం ఐఫోన్‌లోని  అల్ట్రాహ్యూమన్ అనే యాప్‌కి సెండ్ చేస్తుంది. సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రతి నిమిషం మారుతూ ఉంటాయి. ఈ లెవెల్స్ ఆధారంగా ఈ గ్యాడ్జెట్ మీ శరీరంలో ఎంత శక్తి ఉందనేది ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మీరు ఎప్పుడు నిద్రించాలి, ఎప్పుడు తినాలి లేదా ఎప్పుడు వ్యాయామం చేయాలో సూచిస్తుంది.

ఇది కూడా చదవండి : ’ఇలానే ఆడితే శ్రేయస్ అయ్యర్ కు కష్టమే‘.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

“ఈ గ్యాడ్జెట్ ఫిట్‌గా ఉండటానికి ఎలాంటి జీవనశైలిని అవలంబించాలో కచ్చితంగా తెలియజేస్తుంది. ఈ గ్యాడ్జెట్ మీ శరీరానికి లైవ్ ఫ్యూయల్ మీటర్ లాంటిది. శరీరానికి ఇంధనాన్ని రక్తంలో గ్లూకోజ్‌గా పరిగణలోకి తీసుకుంటుంది, ”అని న్యూస్18కి అల్ట్రాహ్యూమన్ సహ వ్యవస్థాపకుడు & సీటీఓ వత్సల్ సింఘాల్ వివరించారు. అల్ట్రాహ్యూమన్ చిప్ రక్తంలో గ్లూకోజ్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది కాబట్టి మధుమేహం రాకుండా జాగ్రత్త పడటం చాలా ఈజీ అవుతుంది. అలాగే, మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా దాని ఆరోగ్యాన్ని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి  : తొలి మ్యాచ్ ఓటమితో మారిన లెక్కలు.. ఆ బౌలర్ పై వేటు ఖాయం.. రెండో టి20కి భారత తుది జట్టు ఇదే

అల్ట్రాహ్యూమన్ చిప్ వివిధ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలతో వస్తుంది. ఈ గ్యాడ్జెట్ 2 వారాలకు రూ.4,999, 12 వారాలకు రూ.24,999, 52 వారాలకు రూ.1,04,999 ధరతో లభిస్తుంది. ఈ సెన్సార్‌ను ప్రతి 15 రోజుల తర్వాత మార్చవలసి ఉంటుంది. అయితే ఇలాంటి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్‌ను చాలా తెలివిగా ప్రమోట్ చేసుకుంటూ కంపెనీ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

First published:

Tags: Fitness, Gadgets, India vs South Africa, Rohit sharma, Shreyas Iyer, South Africa, Team India, Virat kohli

ఉత్తమ కథలు