ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించింది ఆదాయపు పన్ను శాఖ. ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్ (AIS for Taxpayer) పేరుతో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) డౌన్‌లోడ్ చేసుకోవచన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సమాచారాన్ని ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్ యాప్‌లో యాక్సెస్ చేయొచ్చు. టీడీఎస్, వడ్డీ, డివిడెండ్‌లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రీఫండ్స్, GST డేటా లాంటి ఇతర సమాచారం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో లభిస్తుంది. ఓ ఆర్థిక సంవత్సరంలో ఏఏ మార్గాల్లో ఆదాయం వచ్చిందో ఆ వివరాలన్నీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో ఉంటాయి.
ఈ యాప్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ లేదా ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (TIS) యాక్సెస్ చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఏఐఎస్, టీఐఎస్ సమగ్ర వీక్షణను అందించే లక్ష్యంతో యాప్ అభివృద్ధి చేయబడిందని, పన్ను చెల్లింపుదారులకు సంబంధించి వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
Exchange Offer: ఈ మొబైల్ కొంటే రూ.15,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్
ITD has launched a mobile app ‘AIS for Taxpayers’ to enable taxpayers to view their info as available in Annual Information Statement(AIS)/Tax Information Summary(TIS). This will provide enhanced taxpayer service & ease of compliance.(1/2) Press Release:https://t.co/WujCqyYQSe pic.twitter.com/Q6VaC2L2S2
— Income Tax India (@IncomeTaxIndia) March 22, 2023
పన్ను చెల్లింపుదారులకు సులభంగా సేవల్ని అందించడం కోసం ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన యాప్ ఇది. ఈ మొబైల్ యాప్ యాక్సెస్ చేయాలంటే పన్నుచెల్లింపుదారులు తమ పాన్ నెంబర్‌తో రిజిస్టర్ కావాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఆథెంటికేట్ చేయాలి. ఆథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత 4 అంకెల పిన్ సెట్ చేసి యాప్ ఉపయోగించుకోవచ్చు.
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పోర్టల్‌లో కూడా సులువుగా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ యాక్సెస్ చేయొచ్చు. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ యాక్సెస్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Poco X5: పాపులర్ ప్రాసెసర్‌తో పోకో ఎక్స్5 రిలీజ్... అమొలెడ్ డిస్‌ప్లే, 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ
Step 1- ముందుగా https://eportal.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- మీ పాన్ నెంబర్ , పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- హోమ్ పేజీలో Services సెక్షన్‌లో Annual Information Statement (AIS) లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 4- Proceed పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 5- ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత AIS పైన క్లిక్ చేయాలి.
Step 6- అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
Step 7- Taxpayer Information Summary (TIS) పైన క్లిక్ చేస్తే పన్నుచెల్లింపుదారుల సమాచారం ఉంటుంది.
Step 8- Annual Information Statement (AIS) పైన క్లిక్ చేస్తే వార్షిక సమాచార వివరాలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, Personal Finance, Tax returns, TAX SAVING