Chandrayaan-2: ఇస్రోపై పాకిస్తాన్ వ్యోమగామి ప్రశంసలు

చంద్రయాన్-2 విషయంలోనూ పాకిస్తాన్ మంత్రులు ఎన్నో సెటైర్లు వేశారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ తొలి మహిళా వ్యోమగామి సలీమ్ ఇస్రోను పొగడడం హాట్‌టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: September 9, 2019, 7:31 PM IST
Chandrayaan-2: ఇస్రోపై పాకిస్తాన్ వ్యోమగామి ప్రశంసలు
నమైరా సలీమ్
news18-telugu
Updated: September 9, 2019, 7:31 PM IST
Chandrayaan-2: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. చంద్రుడిపై దక్షిణ ధృవంపై పరిశోధనలకు ఇస్రో చేసిన ప్రయత్నం గొప్పదని కొనియాడుతున్నారు. ఐతే పాకిస్తాన్ మాత్రం అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన అబాసు పాలైంది. రాని పని చేయడమెందుకని పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆ దేశ పౌరులే తప్పుబట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్ వ్యోమగామి నమైనా సలీమ్ ఇస్రో ప్రయోగంపై ప్రశంసలు కురిపించింది. చంద్రయాన్-2 ప్రయోగం దక్షిణాసియా గొప్ప ముందడుగని అభిప్రాయపడ్డారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు చారిత్రాత్మక ప్రయత్నం చేసిన ఇండియా,ఇస్రోకు నా అభినందనలు. చంద్రయాన్-2 ప్రయోగం దక్షిణాసియాకు గొప్ప ముందడుగు. కేవలం ఆసియాకు మాత్రమే కాదు. ప్రపంచ అంతరిక్ష రంగానికే గర్వకారణం. భూమిపై ఎన్ని సరిహద్దులు, విభేదాలున్నా అంతరిక్షంలో మాత్రం అందరం ఒక్కటే. అంతరిక్షంలో దేశాల సరిహద్దులు చెరిగిపోతాయి.
నమైనా సలీమ్


ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ఏం పని చేసినా దాయాది దేశం విమర్శిస్తోంది. కారుకూతలు కూస్తూ భారత్‌‌ను చిన్నబుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రయాన్-2 విషయంలోనూ పాకిస్తాన్ మంత్రులు ఎన్నో సెటైర్లు వేశారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ తొలి మహిళా వ్యోమగామి సలీమ్ ఇస్రోను పొగడడం హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా, చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి అక్కడి పరిస్థితులను విశ్లేషించాలనుకున్న చంద్రయాన్-2కి ఆఖరి క్షణాల్లో అవాంతరాలు ఎదురైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ కోల్పోయింది. మొత్తం 15 నిమిషాల సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో 14 నిమిషాలు సజావుగా సాగినా..ఆఖరి నిమిషంలో విక్రమ్‌తో గ్రౌండ్ స్టేషన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఐతే చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్‌ని గుర్తించింది. అంతేకాదు విక్రమ్‌కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇస్రో ప్రకటించింది. ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...