హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Viral Video: ఇంత రిస్క్ అవసరమా భయ్యా.. ఐఫోన్ ఫీచర్‌ను టెస్ట్ చేసేందుకు కార్ యాక్సిడెంట్ చేసిన యూట్యూబర్..

Viral Video: ఇంత రిస్క్ అవసరమా భయ్యా.. ఐఫోన్ ఫీచర్‌ను టెస్ట్ చేసేందుకు కార్ యాక్సిడెంట్ చేసిన యూట్యూబర్..

ఇంత రిస్క్ అవసరమా భయ్యా.. ఐఫోన్ ఫీచర్‌ను టెస్ట్ చేసేందుకు కార్ యాక్సిడెంట్ చేసిన యూట్యూబర్..

ఇంత రిస్క్ అవసరమా భయ్యా.. ఐఫోన్ ఫీచర్‌ను టెస్ట్ చేసేందుకు కార్ యాక్సిడెంట్ చేసిన యూట్యూబర్..

Viral Video: యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న టెక్‌రాక్స్ అనే ఛానెల్‌లో తాజాగా అప్‌లోడ్ అయిన ఒక వీడియో.. వ్యూయర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఛానల్‌లో ఒక వ్యక్తి కొత్త టెక్ ఫీచర్లను టెస్ట్ చేసి రివ్యూలు చెబుతుంటాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటే, దాని గురించి గూగుల్‌ (Google)లో చెక్ చేస్తాం. ఎక్కువ ధర ఉండే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల (Smartphones) గురించి, వాటి పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల (Advanced Features) గురించి తెలుసుకోవడానికి యూటూబర్లు (Youtubers) చెప్పే రివ్యూలు చూస్తాం. అయితే ఇలాంటి రివ్యూల విషయంలో కొందరు కంటెంట్ క్రియేటర్లు (Content Creators) మరీ కచ్చితంగా వ్యవహరిస్తారు. తాజాగా ఇలాంటి ప్రయోగం కోసం ఏకంగా కార్ యాక్సిడెంట్‌ చేశాడు ఒక యూట్యూబర్. యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న టెక్‌రాక్స్ అనే ఛానెల్‌లో తాజాగా అప్‌లోడ్ అయిన ఒక వీడియో.. వ్యూయర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. కొత్త ఐఫోన్ 14 ప్రోలో అందించిన ఒక ఫీచర్‌ను యూట్యూబర్ టెస్ట్ చేసినట్లు వీడియోలో ఉంది. ఇందుకోసం అతడు ఏకంగా తన కారుతో యాక్సిడెంట్ చేయించాడు.

* ఏంటా ఫీచర్?

ఐఫోన్ 14 సిరీస్‌లో ఒక లేటెస్ట్ ఫీచర్ వచ్చింది. కారు ప్రమాదాల సమయంలో బాధితులకు సాయం చేసే ‘క్రాష్ డిటెక్షన్’ ఫీచర్ ఉంది. ఐఫోన్ యూజర్లు కారు ప్రమాదానికి గురైతే, ఈ ఫీచర్ ఆటోమెటిక్‌గా ఆన్ అయ్యి.. ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేస్తుంది. తద్వారా బాధితులను రక్షించే వీలు కలుగుతుంది. అయితే ఈ ఫీచర్‌ను తాజాగా టెస్ట్ చేశాడు టెక్‌రాక్స్ ఛానెల్‌ యూట్యూబర్.

ఇందుకోసం యూట్యూబర్ ఒక ఖాళీ ప్రదేశంలో పాడుబడిన వాహనాలను ఏర్పాటు చేశాడు. వాటిని తన కారుతో ఢీకొట్టాడు. అయితే అతడు నేరుగా కాకుండా, రిమోర్ట్ కంట్రోల్‌తో ఆపరేట్ అయ్యే కారుతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేశాడు. ఇందుకోసం కారులో ఒక కెమెరాను బిగించాడు. దాని ద్వారా ఐఫోన్ ఫీచర్‌ పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు.. డ్రైవర్ సీటు హెడ్‌రెస్ట్‌కు వెనుక భాగంలో ఐఫోన్‌ను కట్టేశాడు.

యూట్యూబర్ మొత్తం మూడుసార్లు తన కారుతో పాడుబడ్డ వాహనాలను ఢీకొట్టగా, ఆశ్చర్యంగా క్రాష్ డిటెక్షన్‌ ఫీచర్ ఆటోమెటిక్‌గా ఆన్ అయింది. దీంతో ఎమర్జెన్సీ SOS కౌంట్‌డౌన్‌ను ఐఫోన్ ఆటోమెటిక్‌గా యాక్టివేట్ చేసింది. ఎమర్జెన్సీ SOS కౌంట్‌డౌన్ 20-సెకన్లుగా ఉంటుంది. ఈలోపు ఎవరూ నోటిఫికేషన్‌ను క్యాన్సిల్ చేయకపోతే, కౌంట్ సున్నాకి చేరుకున్న తర్వాత ఫోన్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. ఇలా ఫీచర్ పనితీరును నేరుగా వీడియోలో వివరించాడు ఈ యూట్యూబర్.

* దెబ్బతిన్న కారు

అయితే ఈ ఎక్స్‌పరిమెంట్ వీడియోలో అతడు రిమోర్ట్‌తో ఆపరేట్ చేసిన కారు భారీగా దెబ్బతిన్నది. దీంతో టెక్ ఫీచర్లు టెస్ట్ చేసేందుకు యూట్యూబర్లు ఇంత కష్టపడుతుంటారా అని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం రివ్యూలు చెప్పడానికి ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని స్పందిస్తున్నారు.

* అడ్వాన్స్‌డ్ ఫీచర్

క్రాష్ డిటెక్షన్ ఫీచర్ గురించి యాపిల్ తన బ్లాగ్‌లో ఇంతకుముందే కొన్ని వివరాలు పేర్కొంది. ‘మీ ఐఫోన్ 14 తీవ్రమైన కారు క్రాష్‌ను గుర్తిస్తే, వెంటనే ఎమర్జెన్సీ సేవలకు కాల్ కనెక్ట్ చేస్తుంది. మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు విషయం తెలియజేస్తుంది’ అని తెలిపింది. ఈ కొత్త క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు లేటెస్ట్ యాపిల్ వాచ్ SE (2వ తరం), యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ అల్ట్రాలో కూడా అందుబాటులో ఉంది. క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌గా యాపిల్ డివైజ్‌లలో డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంది. యూజర్లు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Iphone 14, Tech news, Viral Video, Youtuber

ఉత్తమ కథలు