హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

IIT Madras: అందుబాటులోకి మరో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌.. ఐఐటీ మద్రాస్‌ అంకుర సంస్థ ఘనత

IIT Madras: అందుబాటులోకి మరో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌.. ఐఐటీ మద్రాస్‌ అంకుర సంస్థ ఘనత

IIT Madras: అందుబాటులోకి మరో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌..

IIT Madras: అందుబాటులోకి మరో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌..

IIT Madras: ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఓ ఇంక్యుబేటెడ్ సంస్థ స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఈ ఓఎస్‌కు భరోస్ (BharOS) అనే పేరు పెట్టారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) ఒకటి. ప్రస్తుత రియల్-వరల్డ్ అవసరాలకు తగట్టు సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తోంది. తాజాగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఓ ఇంక్యుబేటెడ్ సంస్థ స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఈ ఓఎస్‌కు భరోస్ (BharOS) అనే పేరు పెట్టారు. కమర్షియల్ ఆఫ్-ది-షెల్ఫ్ హ్యాండ్‌సెట్స్‌లో ఈ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఐఐటీ మద్రాస్‌లోని ఇంక్యుబేటెడ్ ఫర్మ్ (అంకుర సంస్థ) JandK ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (JandKops), ఈ BharOS‌ను అభివృద్ధి చేసింది.

ప్రైవసీ, సెక్యూరిటీ అవసరాలు ఉన్న సంస్థలకు, మొబైల్స్‌లోని రిస్ట్రిక్టెడ్ యాప్స్‌లో కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్‌కు అవసరమయ్యే సెన్షిటివ్ సమాచారాన్ని హ్యాండిల్ చేసే యూజర్ల కోసం ప్రస్తుతం BharOS సేవలను అందిస్తున్నారు. అయితే అటువంటి యూజర్లకు ప్రైవేట్ 5G నెట్‌వర్క్స్ ద్వారా ప్రైవేట్ క్లౌడ్ సేవలను యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

* మరింత నియంత్రణ, ఫ్లెక్సిబులిటీ..

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి మాట్లాడుతూ.. BharOS సర్వీస్ అనేది విశ్వసనీయత అనే పునాదిపై నిర్మించిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నారు. యూజర్లు వారి అవసరాలకు సరిపోయే యాప్‌లను మాత్రమే ఎంచుకోవడానికి, ఉపయోగించడానికి మరింత స్వేచ్ఛ, నియంత్రణ, సౌలభ్యాన్ని అందించడంపై ఇది దృష్టి పెడుతుందన్నారు.

ఈ ఇన్నోవేటివ్ సిస్టమ్ అనేది మొబైల్ డివైజ్‌లో సెక్యూరిటీ, ప్రైవసీ‌‌ని విప్లవాత్మకంగా మారుస్తుందని పేర్కొన్నారు. దేశంలో BharOS వినియోగం, అడాప్షన్ పెంచడానికి మరిన్ని ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, స్ట్రాటజిక్ ఏజెన్సీస్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామకోటి తెలిపారు.

* నమ్మకమైన యాప్‌లకు మాత్రమే..

BharOS అనేది నో డిఫాల్ట్ యాప్స్ (NDA)తో వస్తుంది. దీంతో తమకు తెలియని, విశ్వసించని యాప్‌లను ఉపయోగించమని యూజర్లను ఇది ఫోర్స్ చేయదు. ఈ విధానం వల్ల యూజర్లు తమ డివైజ్‌లోని యాప్స్ పరిమిషన్స్‌పై మరింత నియంత్రణతో వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది.

అంటే, తమ డివైజ్‌లోని స్పెసిఫిక్ ఫీచర్స్ లేదా డేటాను యాక్సెస్ చేయడానికి యూజర్లు విశ్వసించే యాప్‌లను మాత్రమే అనుమతించవచ్చు. డివైజ్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడే 'నేటివ్ ఓవర్ ది ఎయిర్' (NOTA) అప్‌డేట్‌లను BharOS అందిస్తుందని JandK ఆపరేషన్స్ Pvt Ltd డైరెక్టర్ కార్తీక్ అయ్యర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే, ఇండియాలో టాప్ 5 ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి

* NOTA అప్‌డేట్స్ ఆటోమెటిక్‌గా

BharOS ద్వారా యూజర్లు ప్రాసెస్‌ను మాన్యువల్‌గా ప్రారంభించాల్సిన అవసరం లేకుండానే, NOTA అప్‌డేట్స్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయి, డివైజ్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. లెటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్, బగ్ ఫిక్స్‌తో కూడిన లెటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎల్లప్పుడు డివైజ్‌లో రన్ అవుతుంది.

NDA, PASS, NOTA‌తో భారతీయ మొబైల్ ఫోన్స్ సెక్యూరిటీ పరంగా విశ్వసనీయంగా ఉన్నాయని BharOS నిర్ధారిస్తుంది. ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్ (PASS) నుంచి నమ్మదగిన యాప్‌లకు BharOS యాక్సెస్‌ను అందించనుంది. PASS అనేది సంస్థల స్పెసిఫిక్ సెక్యూరిటీ, ప్రైవసీ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉన్న యాప్స్ క్యూరేటెడ్ జాబితాకు యాక్సెస్‌ను అందిస్తుంది.

First published:

Tags: IIT Madras, Latest Technology, Mobile, Tech news

ఉత్తమ కథలు