హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

IIT-Madras: స్క్రీన్‌పై వస్తువులను చేతితో తాకిన ఫీల్‌ కలుగుతుంది.. అదిరిపోయే టెక్నాలజీని డెవలప్‌ చేసిన ఐఐటీఎం పరిశోధ?

IIT-Madras: స్క్రీన్‌పై వస్తువులను చేతితో తాకిన ఫీల్‌ కలుగుతుంది.. అదిరిపోయే టెక్నాలజీని డెవలప్‌ చేసిన ఐఐటీఎం పరిశోధ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ షాపింగ్ చేయడం వల్ల దాదాపుగా 30 శాతం వస్తువులను వినియోగదారులు రిటర్న్ చేస్తున్నారు. అందుకు కారణం మిస్‌మ్యాచ్. వినియోగదారుడు అనుకున్న వస్తువు కాకుండా వేరే వస్తువు డెలివరీ అవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

IIT-Madras:  ప్రస్తుతం దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఏదైనా వస్తువు గురించి వివరాలు తెలియాలంటే వెంటనే ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఆన్‌ చేసి సెర్చ్‌ చేస్తున్నారు. ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో రివ్యూలు చదివి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లకు వెళ్లి వస్తువులను పట్టిచూసి, పరిశీలించి కొనేవారు తక్కువైపోయారు. అందుకే ఆన్‌లైన్‌ మార్కెట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఇక్కడ మరో అంశం ఉంది.. ఆన్‌లైన్ షాపింగ్ చేయడం వల్ల దాదాపుగా 30 శాతం వస్తువులను వినియోగదారులు రిటర్న్ చేస్తున్నారు. అందుకు కారణం మిస్‌మ్యాచ్. వినియోగదారుడు అనుకున్న వస్తువు కాకుండా వేరే వస్తువు డెలివరీ అవుతోంది. ఈ సమస్యకు ఐఐటీ మద్రాసు పరిశోధకులు డెవలప్‌ చేసిన సరికొత్త టెక్నాలజీ చెక్‌ పెట్టనుంది. ఇంతకీ ఆ టెక్నాలజీ ఎలా వినియోగించవచ్చు? ఆ టెక్నాలజీతో వస్తువులను ఏ విధంగా పరిశీలించవచ్చు? తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

వస్తువులను తాకిన అనుభూతి పొందవచ్చు

సాధారణంగా మనం ఏదైనా వస్తువులను డిజిటల్‌ స్క్రీన్‌లపై చూడగలం. టచ్‌ ద్వారా ఆర్డర్‌లు ప్లేస్‌ చేయడం, క్యాన్సల్‌ చేయడం వంటివి చేయవచ్చు. కానీ ఐఐటీ మద్రాసు పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టచ్ స్క్రీన్ టెక్నాలజీతో కస్టమర్స్ డిస్ ప్లేలోని వస్తువులను ఫీల్ కూడా కావచ్చు. ఐటాడ్( iTad’-Interactive Touch Active Display) ఆధారంగా మీరు ఆయా వస్తువుల అంచులను, ఉపరితలాలను, అల్లికలను అనుభూతి చెందవచ్చు. ఈ ఐటాడ్‌లో ఎలాంటి కదిలే వస్తువులు ఉండవు. ఇన్‌బిల్ట్ మల్టీ టచ్ సెన్సార్స్ ద్వారా వస్తువలను ఫీల్‌ కావచ్చు. అవి చేతివేళ్ల కదలికలను గ్రహించి సాఫ్ట్‌వేర్ ఆధారంగా వస్తువు ఉపరితలంపైన ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ కట్టడం మిస్‌ అయ్యారా? అయితే ఇలా చేయడం మేలు..

 మౌజ్ తరహా డివైజ్‌ తయారీ

టచ్‌లాబ్ నుంచి ప్రోటోటైప్‌ను ఏడాదిలో తయారు చేయవచ్చునని మెర్కెల్ హాప్టిక్స్ సీఈఓ పీవీ పద్మప్రియ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి డెస్క్ మీద ఒక కంప్యూటర్ మౌస్ ఎలా ఉందో అదే మాదిరిగా మరొక చిన్న డివైజ్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని, దాంతో సరికొత్త అనుభూతులను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చని పద్మప్రియ తెలిపారు. టెక్నాలజీ వర్కింగ్‌ను మరింత మెరుగుపరచడానికి ఫీల్డ్ టెస్టింగ్ చేస్తున్నామని, ఐఐటీ-మద్రాసు పరిశోధకులకు విలువైన ఫీడ్ బ్యాక్‌ను అందిస్తున్నామని పద్మప్రియ స్పష్టం చేశారు.

 ఈ టెక్నాలజీతో నెక్స్ట్ లెవల్ షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్

ఈ పరిశోధనకు ఐఐటీ-ఎం అప్లైడ్ మెకానిక్స్ విభాగం ప్రొఫెసర్ ఎం.మణివణ్ణన్ నేతృత్వం వహించారు. ఐఐటి-ఎం రీసెర్చ్ పార్క్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయిన మెర్కెల్ హాప్టిక్స్..టచ్ ల్యాబ్ తో కలిసి పరిశోధనను మరింత ముందకు తీసుకెళ్లేందుకు పనిచేస్తోంది. ‘‘ఇక ఐటాడ్ శకం ప్రారంభమవుతుంది. ఈ టెక్నాలజీ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లొచ్చు. ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ లపై వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు మనం వాటిని తాకవచ్చు, అనుభూతి చెందవచ్చు. అలా వినియోగదారులకు లాభం జరుగుతుంది’’ అని ప్రొఫెసర్ మణివణ్ణన్ వెల్లడించారు.

First published:

Tags: IIT Madras

ఉత్తమ కథలు