హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Home Covid 19 Kit: ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఎల‌క్ట్రిక‌ల్ కిట్ రూపొందించిన‌ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్.. కిట్ ధర ఎంతంటే..

Home Covid 19 Kit: ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఎల‌క్ట్రిక‌ల్ కిట్ రూపొందించిన‌ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్.. కిట్ ధర ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Covid 19 Kit: ఐఐటి హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ కొత్త తరహా కరోనా టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేశారు. దాని పేరు ‘కోవిహోమ్’గా నామకరణం చేశారు. దీని ద్వారా ఇట్లోనే సులువుగా కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ 'కోవిహోమ్' అనే కృత్రిమ కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. వైద్యుల సహాయం లేకుండానే ఇంట్లోనే కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేశాడు. కరోనా లక్షణాలు ఉన్నవారికీ మరియు లక్షణాలు లేని వారు కూడా దీని ద్వారా పరీక్ష చేసుకుంటే 30 నిమిషాల్లో ఫలితం వస్తుందని పేర్కొన్నారు. ఆర్‌టి-పిసిఆర్ (రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) లేదా బిఎస్‌ఎల్ 2 ల్యాబ్ సౌకర్యం అవసరం లేకుండానే ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్‌తో సమానంగా ఈ రిజల్ట్ ఉంటుందని ప్రొఫెసర్ శివ గోవింద్ తెలిపారు. అందువల్ల నిపుణుల పర్యవేక్షణ లేకుండా హోమ్ కిట్‌లో పరీక్షగా ఉపయోగించుకునే అవకాశం ఉందని వివరించారు. కోవీహోమ్ టెస్టింగ్ కిట్‌ను డెవ‌ల‌ప్ చేసిన ప‌రిశోధ‌కుల బృందంలో డాక్ట‌ర్ సూర్య‌స్నాట త్రిపాఠి, సుప్ర‌జా ప‌ట్ట‌, స్వాతి మోహంతితో పాటు ఇత‌ర విద్యార్థులు కూడా ఉన్నారు.

ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెస‌ర్ గోవింద్ ఆధ్వ‌ర్యంలో ఈ కిట్‌ను త‌యారు చేశారు. చాలా చౌకైన ధ‌ర‌లో టెస్టింగ్ కిట్‌ను రూపొందించామ‌ని వారు తెలిపారు. వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. తాము ఇప్పటికే పరికరం కోసం పేటెంట్ దాఖలు చేశామని.. అయితే భారీ స్థాయిలో కిట్‌ల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు భాగ‌స్వామ్యుల కోసం చూస్తున్నామ‌ని ప్రొఫెస‌ర్ తెలిపారు. కోవీహోమ్ కిట్‌తో హైదరాబాద్ లోని ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజీలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB) అంతర్గత నమూనాలతో SARS-Cov-2 వైరస్ను గుర్తించడానికి వేగవంతమైన RNA ఎలక్ట్రానిక్ డయాగ్నొస్టిక్ పరికరం ధ్రువీకరణను నిర్వహించింది. ఈ నమూనాలను ఆర్టీపీసీఆర్ నమూనాలతో బేరీజు చేయగా కిట్ యొక్క సామర్థ్యం 94.2 శాతం, సున్నితత్వం 91.3 శాతం మరియు నిర్దిష్టత 98.2 శాతం నిర్ధారించింది. ఈ కిట్ ధర రూ.400 గా నిర్ణయించారు

First published:

Tags: Corona, Covid test, Covid-19, IIT Hyderabad, Vaccinated for Covid 19

ఉత్తమ కథలు