ఐఐటీ హైదరాబాద్‌లో క్రేజీ కోర్స్...బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

IIT Hyderabad | టెక్నాలజీ రోజురోజుకీ ఎక్కువగా వాడకంలో వస్తోంది. ఈనేపథ్యంలోనే ఐఐటీ హైదరాబాద్ ఓ క్రేజీ ఆలోచన చేసింది. బీటెక్‌లో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(కృత్రిమ మేథ కోర్సు)ను ప్రవేశపెట్టింది.

news18-telugu
Updated: January 18, 2019, 8:57 AM IST
ఐఐటీ హైదరాబాద్‌లో క్రేజీ కోర్స్...బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 18, 2019, 8:57 AM IST
ఫ్యూచర్‌ మొత్తం టెక్నాలజీ మీదే ఆధారపడుతుంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేథ) భవిష్యత్తులో పలు రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది.  ఇప్పటికే ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో.. విద్యాసంస్థలు వీటిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే.. ఆయా కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఉబలాటపడుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఐఐటీ హైదరాబాద్ ఓ అడుగు ముందుంది. 2019-2020 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌లో పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సును ప్రారంభించనుంది. ఏఐలో పూర్తిస్థాయిలో మొట్టమొదటి బీటెక్ ప్రోగ్రామ్‌ ప్రవేశ పెట్టిన ఘనత దేశంలో ఐఐటీ-హైదరాబాద్‌కే దక్కుతుంది.

బీటెక్ ఏఐలో 20 మంది విద్యార్థులను తీసుకుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఈ అడ్మీషన్లు జరుగుతాయి.  వీరికి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో అత్యున్నత శిక్షణనిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్‌‌కి ఏమాత్రం తగ్గకుండా వీరి నాలెడ్జ్ ఉండేలా ట్రైనింగ్ ఉంటుంది. ఏఐలో బీటెక్‌తో పాటు ఎంటెక్ పలు ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో పెరిగిన డిమాండ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.

ఇప్పటికే.. అమెరికాలోని కర్నెగీ మెలన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కోర్సును అందిస్తుండగా.. మన ఐఐటీ హైదరాబాద్ మూడో విద్యాసంస్థగా నిలవనుంది.

First published: January 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...