Home /News /technology /

IIT DHARWAD STUDENTS HAVE DESIGNED A MOBILE APP WHICH WILL HELP TO DETECT FAKENEWS NS

Fake News: ఫేక్ న్యూస్ పని పట్టే యాప్.. ఐఐటీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fake News: ఫేక్ వార్తలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న ఈ సమయంలో ఐఐటీ ధర్వాడ్ విద్యార్థులు కీలక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఫేక్ వార్తలను గుర్తించి వాటి గుట్టు విప్పే ఓ యాప్ తయారు చేసే ప్రయత్నంలో వారు నిమగ్నమయ్యారు.

    ఇంటర్ నెట్లో నిత్యం వందాలాది ఫేక్ న్యూస్ లు మనకు కనిపిస్తాయి. అవి నిజమో, కాదో తేల్చడం, తెలుసుకోవడం చాలా కష్టమైన పని. చాలా మంది కొందరు సృష్టించిన తప్పుడు వార్తలను నిజమని నమ్ముతుంటారు. అనేక మంది అవి వాస్తవాలని నమ్మి మోసపోయిన ఘటనలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఈ ఫేక్ వార్తల సంఖ్య అధికమైంది. అక్కడ ఇంత మందికి కరోనా వచ్చింది.. ఇక్కడ అన్ని వేల మందికి వైరస్ సోకింది అన్న అబద్ధపు వార్తలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి. ఇలా తప్పుడు వార్తలు సృష్టించే వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం ఎన్నో సార్లు ప్రకటనలు చేసింది. అనేక మందిని పోలీసులు అరెస్టు సైతం చేశారు. అయినా తప్పుడు వార్తల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల ఏకంగా తెలంగాణ డీజీపీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నాయన్న తప్పుడు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వార్తతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను సైతం ప్రభుత్వం బదిలీ చేయబోతోందని మరో పోస్టు కూడా ఫార్వర్డ్ అవుతూ వచ్చింది.

    అయితే ఈ విషయం కొందరు జర్నలిస్టుల దృష్టికి వెళ్లడంతో వారు ఈ విషయం నిజమా?కాదా? అన్న వివరాలు సేకరించగా.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ వార్త పూర్తిగా ఫేక్ అని తేలింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ పైనే ఫేక్ వార్తలు సృష్టించడం ఆ సమయంలో సంచలనంగా మారింది. లాక్ డౌన్ సీరియస్ గా సాగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు తెలంగాణలో వైన్స్ షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతించిందంటూ ఓ తప్పుడు వార్తను తయారు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇందు కోసం ఏకంగా ఓ ఫేక్ జీవోను కూడా వారు తయారు చేయడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ తప్పుడు వార్త తయారు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేశారు. దేశంలో తప్పుడు వార్తల సంచారం ఎలాగుందో చెప్పడాడానికి ఈ ఘటనలు నిదర్శనంగా చెప్పవచ్చు.


    ఇలా ఫేక్ వార్తలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న ఈ సమయంలో ఐఐటీ ధర్వాడ్ విద్యార్థులు కీలక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఫేక్ వార్తలను గుర్తించి వాటి గుట్టు విప్పే ఓ యాప్ తయారు చేసే ప్రయత్నంలో వారు నిమగ్నమయ్యారు. మరో రెండు నెలల్లో ఈ యాప్ ను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్వయంగా తన ట్విట్టర్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రెండు నెలల్లో లాంచ్ కాబోతున్న ఈ యాప్ తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక అద్భుత ఆవిష్కరణ అని మంత్రి అభినందించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Fake news, Mobile App, Social Media

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు