హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Parag Agrawal: ట్విట్టర్ కొత్త సీఈవోగా ఐఐటీ బాంబే విద్యార్థి పరాగ్​ అగర్వాల్.. అతని గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలివే!

Parag Agrawal: ట్విట్టర్ కొత్త సీఈవోగా ఐఐటీ బాంబే విద్యార్థి పరాగ్​ అగర్వాల్.. అతని గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలివే!

పరాగ్​ అగర్వాల్​ (ఎడమ) (photo: smcs/twitter)

పరాగ్​ అగర్వాల్​ (ఎడమ) (photo: smcs/twitter)

2006వ సంవత్సరంలో డోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్​ను స్థాపించారు. అప్పటి నుంచి ట్విట్టర్​ సీఈవోగా డోర్సేనే కొనసాగుతూ వచ్చారు. పరాగ్​ నియామకంతో దాదాపు 16 ఏళ్ల తర్వాత సంస్థకు కొత్త సీఈవోను ఎన్నుకున్నారు.

ప్రపంచ స్థాయి టెక్​ దిగ్గజ కంపెనీల్లో భారతీయుల (Indians) హవా కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్​ సీఈవోగా సుందర్ పిచాయ్ (Sundar Pichai), మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల (Satya Nadella) నియమితులై భారత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేయగా.. ఇప్పుడు, భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి దిగ్గజ టెక్​ కంపెనీ ట్విట్టర్​కు సీఈవో (twitter CEO)గా నియమితులయ్యారు. అతనే పరాగ్​ అగర్వాల్ (Parag Agarwal)​. ప్రస్తుత ట్విట్టర్​ సీఈవో​ జాక్ డోర్సే తన పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ట్విట్టర్​ చీఫ్​ టెక్నికల్ ఆఫీసర్​గా పని చేస్తున్న పరాగ్​ అగర్వాల్​ను బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2006వ సంవత్సరంలో డోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్​ (twitter)ను స్థాపించారు. అప్పటి నుంచి ట్విట్టర్​ సీఈవోగా డోర్సేనే కొనసాగుతూ వచ్చారు. పరాగ్​ నియామకంతో దాదాపు 16 ఏళ్ల తర్వాత సంస్థకు కొత్త సీఈవోను (new CEO) ఎన్నుకున్నారు. దీంతో ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్​ అగర్వాల్​ కూడా చేరారు.

పూర్తి నమ్మకం ఉంది :  డోర్సే

ఈ సందర్భంగా డోర్సే​ మాట్లాడుతూ ‘‘పరాగ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఆయన కంపెనీ అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారు. అతని నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు (leadership qualities) చూసి బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తనను ఎంపిక చేయాలన్న నిర్ణయం నాదే. కంపెనీ అవసరాలను అతను బాగా అర్థం చేసుకున్నాడు. కంపెనీ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక పరాగ్​ ఉన్నాడు. అతని నాయకత్వంలో కంపెనీ మరింత ముందుకు వెళ్తుందని గట్టిగా విశ్వసిస్తున్నాను.” అని చెప్పారు.

* పరాగ్ అగర్వాల్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

1. పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబే (IIT Bombay) నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్​ ఇంజనీరింగ్‌లో బీటెక్​ పూర్తి చేశారు.

2. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్​డీ చేశారు.

3. ట్విట్టర్​కు ముందు పరాగ్​ మైక్రోసాఫ్ట్ (Microsoft), యాహూ (Yahoo), ఏటీ అండ్​ టీ ల్యాబ్స్​లో పనిచేశారు.

4. 2011 అక్టోబర్ లో పరాగ్​ ట్విట్టర్‌లో చేరారు.

5. డిస్టింగ్విష్డ్​ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా ట్విట్టర్​లో జాయిన్​ అయిన పరాగ్​.. ఆ తర్వాత చీఫ్​ టెక్నాలజీ ఆఫీసర్​గా ప్రమోట్ అయ్యారు.

6. పరాగ్ ప్రణాళికల కారణంగా 2016, 2017లో కొత్త ట్విట్టర్‌ యూజర్ల చేరిక వేగవంతమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా పేర్కొంది.

7. 2018 అక్టోబర్​లో ట్విట్టర్​ సంస్థ పరాగ్‌ని సీటీఓ (CTO)గా నియమించింది.

8. సీటీఓగా పరాగ్ కంపెనీ టెక్నికల్​ విభాగానికి (Technical department) బాధ్యత వహిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్​ టెక్నాలజీతో కంపెనీ డెవలప్​మెంట్​కు కృషి చేశారు.

9. 2019లో ట్విట్టర్​ సీఈవో జాక్ డోర్సే పరాగ్‌ని ప్రాజెక్ట్ బ్లూస్కీ (Project BlueSky)కి అధిపతిగా నియమించారు. ఓపెన్​, డీసెంట్రలైజ్డ్​ స్టాండర్డ్ ఉన్న సోషల్​మీడియాను క్రియేట్​ చేయడానికి ట్విట్టర్​ ఈ ప్రాజెక్ట్​ను చేపట్టింది.

10. పీపుల్ ఏఐ తెలిపిన వివరాల ప్రకారం, పరాగ్ అగర్వాల్ ఆస్తి 1.52 మిలియన్​ డాలర్లుగా ఉంది.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: IIT Bombay, Technology, Twitter

ఉత్తమ కథలు