Document Image Analysis: ఇమేజ్ ఫార్మాట్లో స్పామ్ ఈ మెయిల్స్ మీకూ వస్తున్నాయా..? నిరోధించేందుకు అద్భుతమైన పరిష్కారం..!

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా స్పామర్లు స్పామ్ బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు చిక్కకుండా ఉండేందుకు టెక్ట్స్‌ను ఫోటోల రూపంలో మెయిల్ చేస్తున్నారు. ఈ ఇమేజ్‌లలో ఉండే టెక్స్ట్‌ను కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ సులభంగా రీడ్ చేయలేవు.

  • Share this:
మన ఈమెయిల్‌కు అనవసరమైన స్పామ్ మెయిల్స్‌ ఎన్నో వస్తుంటాయి. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కంపెనీలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. స్పామ్ బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌ సాయంతో మెయిళ్లలో ఉంటే సమాచారాన్ని (టెక్స్ట్) రీడ్ చేసి, దాని ఆధారంగా అవి స్పామ్‌ కిందకు వస్తాయో లేదో గుర్తించవచ్చు. కానీ ఇమేజ్‌ల రూపంలో ఉండే టెక్ట్స్‌ను ఈ సంకేతికత అడ్డుకోలేదు. ఫలితంగా ఇలాంటి స్పామ్ ఈమెయిళ్లను నిరోధించడం కంపెనీలకు సాధ్యం కాలేదు. ఈ టెక్నాలజీపై ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (IIIT-H) పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. స్కాన్ చేసిన డాక్యుమెంట్, స్ట్రీట్ మార్క్‌లు.. వంటి ఇమేజ్ రూపంలో ఉన్న సమాచారాన్ని రీడ్ చేసి గుర్తించగల వ్యవస్థపై సంస్థ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

బార్సిలోనాకు చెందిన కంప్యూటర్ విజన్ సెంటర్ (CVC), సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT), IIIT-H పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. డాక్యుమెంట్ ఇమేజ్‌ను సమర్థంగా విశ్లేషించడానికి, వాటిని సులభంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పామ్ బ్లాకింగ్ టెక్నాలజీపై వారు ప్రయోగాలు చేస్తున్నారు.

ఎలా గుర్తిస్తారు?
సాధారణంగా స్పామర్లు స్పామ్ బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు చిక్కకుండా ఉండేందుకు టెక్ట్స్‌ను ఫోటోల రూపంలో మెయిల్ చేస్తున్నారు. ఈ ఇమేజ్‌లలో ఉండే టెక్స్ట్‌ను కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ సులభంగా రీడ్ చేయలేవు. ఈ లోపాన్ని గుర్తించే టెక్నాలజీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు దీనిపై తమ బృందం పనిచేస్తోందని CVIT ప్రతినిధి జవహర్ చెప్పారు. కేవలం ఇమేజ్‌లలో ఉండే టెక్ట్స్‌ను రీడ్ చేయడమే కాకుండా దాన్ని సమగ్రంగా విశ్లేషించేందుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఒక డాక్యుమెంట్, ఒక పుస్తకం, వార్షిక నివేదిక.. వంటి వాటిలో ఉండే టెక్స్ట్‌ను గుర్తించగలిగే వ్యవస్థను సృష్టిస్తున్నామని వివరించారు. ఈ పరిశోధనకు ‘డాక్యుమెంట్ విజువల్ క్వశ్చన్ ఆన్సర్నింగ్’ అని పేరు పెట్టారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ నిజం.. గర్భం దాల్చే సయమంలో స్త్రీలలో ఈ ఒక్క లక్షణం కనుక ఉంటే.. పుట్టబోయేది ఆడబిడ్డే..!

మనుషుల రిక్వెస్ట్‌లను అర్థం చేసుకోవడంతో పాటు, వాటికి తగిన విధంగా కంప్యూటర్లు స్పందించేలా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఇమేజ్‌లో ఏముందో గుర్తించాలని సిస్టమ్‌ని అడగటం దగ్గరి నుంచి ఇమేజ్‌లో ఏం జరుగుతుందో గుర్తించడం వంటి క్లిష్టమైన ప్రశ్నలు ఈ జాబితాలో ఉంటాయి. వీటికి సిస్టమ్ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఆ ఇమేజ్ స్పామ్ కిందకు వస్తుందో రాదో గుర్తించవచ్చు. ఈ డాక్యుమెంట్ ఇమేజింగ్ ఎనాలిసిస్‌ స్పామ్ మెయిల్స్‌ను నిరోధించేందుకు పరిష్కారాన్ని చూపిస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
First published: