Home /News /technology /

IF YOU HAVE THESE 17 APPS ON YOUR APPLE IPHONE DELETE THEM NOW SS

Apps: మీ ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి

Apps: మీ ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి

Apps: మీ ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి

Malware Apps | ఈ విషయం బయటపడగానే ఆ యాప్స్ అన్నింటినీ యాప్ స్టోర్ నుంచి తొలగించింది యాపిల్. అయితే వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే డిలిట్ చేయాల్సి ఉంటుంది.

    స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవాళ్లు మాల్‌వేర్, వైరస్, నకిలీ యాప్స్ నుంచి తప్పించుకోలేరు. మీ డేటాను కొట్టేసే, మీ ప్రైవసీని భంగపర్చే, మీ అకౌంట్లను కొల్లగొట్టే యాప్స్ చాలానే ఉన్నాయి. అప్పుడప్పుడు వాటి పేర్లు బయటకొస్తుంటాయి. వాటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అలాంటి యాప్స్‌ను డిలిట్ చేయడమే మంచిది. ఐఓఎస్‌లోని 17 యాప్స్‌లో క్లిక్కర్ ట్రోజాన్ మాల్‌వేర్ ఉందంటూ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ వాండేరా లిస్ట్ బయటపెట్టింది. ఈ మాల్‌వేర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటుంది. వెబ్ పేజెస్‌ని ఓపెన్ చేసి, అందులోని అడ్వర్‌టైజ్‌మెంట్లను క్లిక్ చేస్తుంటుంది. దాని ద్వారా మాల్వేర్ సృష్టించినవారికి ఆదాయం లభిస్తుంది. ఇదంతా మీకు తెలియకుండా ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిపోతుందని మొబైల్ సెక్యూరిటీ కంపెనీ వాండేరా వెల్లడించింది. ఈ విషయం బయటపడగానే ఆ యాప్స్ అన్నింటినీ యాప్ స్టోర్ నుంచి తొలగించింది యాపిల్. అయితే వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే డిలిట్ చేయాల్సి ఉంటుంది.

    మాల్‌వేర్ ఉన్న ఆ 17 యాప్స్ ఇవే...


    RTO Vehicle Information
    EMI Calculator & Loan Planner
    File Manager – Documents
    Smart GPS Speedometer
    CrickOne – Live Cricket Scores
    Daily Fitness – Yoga Poses
    FM Radio – Internet Radio
    My Train Info – IRCTC & PNR
    Around Me Place Finder
    Easy Contacts Backup Manager
    Ramadan Times 2019
    Restaurant Finder – Find Food
    BMI Calculator – BMR Calc
    Dual Accounts
    Video Editor – Mute Video
    Islamic World – Qibla
    Smart Video Compressor

    భారతదేశానికి చెందిన యాప్ యాస్పెక్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్ ఈ 17 యాప్స్‌ని రూపొందించినట్టు తేలింది. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి.

    తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Google Apps: స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నారా? ఈ 5 యాప్స్ ట్రై చేయండి

    Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్ వివరాలివే

    Diwali 2019: వాట్సప్‌లో దీపావళి స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేయండి
    First published:

    Tags: Apple, FAKE APPS, Ios, Iphone, Mobile App

    తదుపరి వార్తలు