ప్రపంచం వేగంగా కదులుతోంది. కొత్త కొత్త అవసరాలతో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విషయంలో వారికి సహాయం చేయడానికి మైక్రోసాఫ్ట్(Microsoft), లింక్డిన్(LinkedIn) సంయుక్తంగా సిద్ధం అవుతున్నాయి. ఈ కంపెనీలు ‘స్కిల్స్ ఫర్ జాబ్స్’ ప్రోగ్రామ్ తదుపరి ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఆరు ఉద్యోగాలకు సంబంధించిన 350 కోర్సులకు ఫ్రీ యాక్సెస్ కల్పించాయి. అందుకు సంబంధించిన సర్టిఫికేషన్లను కూడా ఇవ్వనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* ఇండియా నుంచే 70 లక్షల మంది
మైక్రోసాఫ్ట్, లింక్డిన్ కలిసి 50 వేల లెర్నింగ్ స్కాలర్షిప్లను అందించేందుకు ప్రణాళికలు చేసుకున్నాయి. హై డిమాండ్ ఉన్న జాబ్‌ల కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నాయి. 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కోటి మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని Microsoft భావిస్తోంది. భారత్‌లో క్రిటికల్ సాఫ్ట్వేర్ స్కిల్స్, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, ఫైనాన్షియల్ అనలిస్ట్‌లు, ప్రాజెక్ట్ మేనేజర్, కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు లింక్డిన్ టాప్ లెర్నింగ్ ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆసియాలో ఇప్పటికే కోటి నలభై లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో 70 లక్షల మందికి పైగా భారత్ నుంచే ఉన్నారు.
* అవసరాలు, నైపుణ్యాల మధ్య వ్యత్యాసం
ఈ విషయాలపై మైక్రోసాఫ్ట్ ఇండియా నేషనల్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ రోహిణి శ్రీవత్స మాట్లాడారు. ప్రస్తుత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, వాటికి తగ్గ నైపుణ్యాల విషయంలో గ్యాప్ ఉందన్నారు. భారత యువతకు ఇప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం తమ సంస్థ ఇన్వెస్ట్ చేస్తోందని తెలిపారు. వెనుకబడిన వారికీ ఈ సేవలను చేరువ చేసి, అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో 10 లక్షల మందికి తాము సాయపడాలని అనుకున్నట్లు తెలిపారు. కావాల్సిన నైపుణ్యాలను కల్పించడం కోసం వారికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. దీంతో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, విజయాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Infinix Hot 20S: ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ రేంజ్లో మరో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. క్యాప్షన్‌తో ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్ చేసే అవకాశం..
* లింక్డిన్ భాగస్వామ్యం
ఈ కార్యక్రమం కోసం తాము లింక్డిన్తో కలిసి పని చేస్తున్నామని రోహిణి శ్రీవత్స వెల్లడించారు. దీనితోపాటుగా తమకు లోకల్ పార్టనర్లు కార్యక్రమ నిర్వహణలో సహకరిస్తున్నారని చెప్పారు. స్థానిక సంఘాల సహకారం కూడా తమకు ఉందని తెలిపారు. ఈ డిజిటల్ ఎకో సిస్టమ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉందని దీనికి తగినట్లుగా యువత సిద్ధం అవ్వాలని సూచించారు. అప్పుడే ఈ పోటీ వాతావరణంలో వారికి భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెప్పారు. అందుకనే తాము నైపుణ్యాలను టీచ్ చెయ్యడంపై దృష్టి పెట్టామని తెలిపారు. దీని ద్వారా తాము రెండు రకాలుగా సహాయం చేయగలుగుతున్నామన్నారు. ఒకటి ఉద్యోగార్థులు సరైన అవకాశాలను అందుకునేలా చేస్తున్ననామని, రెండు సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను అందిస్తున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.