Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్

Google Pay Tez Shots Mini Cricket Game | ఈ గేమ్ ఎన్నిసార్లైనా ఆడొచ్చు. మీరు గరిష్టంగా రూ.3,300 విలువైన స్క్రాచ్ కార్డ్స్ గెలుచుకోవచ్చు.

news18-telugu
Updated: June 24, 2019, 12:03 PM IST
Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్
Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్ (Source: Google)
news18-telugu
Updated: June 24, 2019, 12:03 PM IST
మీరు పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ కోసం గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, పేమెంట్స్ సమయంలో స్క్రాచ్ కార్డ్స్ ద్వారా క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటుంది గూగుల్. ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ కావడంతో యూజర్లకు 'Tez Shots' గేమ్ నిర్వహిస్తోంది. ఈ గేమ్ ఆడి ఎక్కువగా స్కోర్ చేసిన వారికి రూ.3,300 విలువైన స్క్రాచ్ కార్డ్స్ అందిస్తోంది. జూన్ 5న ప్రారంభమైన ఈ గేమ్ జూలై 31 వరకు కొనసాగుతుంది. ఈ గేమ్ ఎన్నిసార్లైనా ఆడొచ్చు. మీరు గరిష్టంగా రూ.3,300 విలువైన స్క్రాచ్ కార్డ్స్ గెలుచుకోవచ్చు. మీరు టార్గెట్ రీచ్ కాగానే రివార్డ్స్ సెక్షన్‌లో స్క్రాచ్ కార్డ్స్ కనిపిస్తాయి. పేమెంట్స్ చేసిన తర్వాత స్క్రాచ్ కార్డ్స్ యాక్టివేట్ అవుతాయి.

Google Pay Tez Shots: ఎలా ఆడాలి? స్క్రాచ్ కార్డ్స్ ఎలా గెలుచుకోవాలి?



గూగుల్ పే 'తేజ్ షాట్స్' క్రికెట్ గేమ్ ఆడాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఉండాలి. ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే మీ ఫోన్‌లో యాప్ ఉంటే అప్‌డేట్ చేయాలి. 'Promotions' సెక్షన్‌లో మీకు 'Tez Shots' కనిపిస్తుంది. క్లిక్ చేస్తే క్రికెట్ గేమ్ ఓపెన్ అవుతుంది. మీరు బ్యాటింగ్ చేసి రన్స్ స్కోర్ చేస్తే చాలు. స్కోర్ ఎంత పెరిగితే మీరు స్క్రాచ్ కార్డ్స్ గెలుచుకునే అవకాశాలు అంత పెరుగుతాయి. మొత్తం స్కోర్‌ను బట్టి స్క్రాచ్ కార్డ్స్ గెలుచుకోవచ్చు.
Loading...

Google Pay Tez Shots: ఎన్ని రన్స్‌కు ఎంత విలువైన స్క్రాచ్ కార్డ్స్ గెలుచుకోవచ్చు?


100 పరుగులు- రూ.50
500 పరుగులు- రూ.100
1000 పరుగులు- రూ.150
2000 పరుగులు- రూ.1,000
3000 పరుగులు- రూ.2,000

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడితే కొమ్ములు వస్తున్నాయి... ఇదిగో సాక్ష్యం

Bamboo Business: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే

Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...