హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

IT dept Grievances: ఇకపై కొత్త పద్ధతిలో ఐటీ విభాగానికి ఫిర్యాదులు.. మూడు కొత్త ఈమెయిల్ ఐడీలు

IT dept Grievances: ఇకపై కొత్త పద్ధతిలో ఐటీ విభాగానికి ఫిర్యాదులు.. మూడు కొత్త ఈమెయిల్ ఐడీలు

అయితే దీనిపై స్పందించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో రిటర్న్స్ భౌతికంగా ఫైల్ చేయడం ఇక సాధ్యం కాదనే విషయంలో క్లారిటీ వచ్చింది.

అయితే దీనిపై స్పందించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.. పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో రిటర్న్స్ భౌతికంగా ఫైల్ చేయడం ఇక సాధ్యం కాదనే విషయంలో క్లారిటీ వచ్చింది.

ట్యాక్స్ చెల్లించేవారు ఫిర్యాదులను నమోదు చేయడానికి మూడు అధికారిక ఈమెయిల్ ఐడీలను ఆదాయపు పన్ను విభాగం శనివారం విడుదల చేసింది. ఈ విషయాన్ని ఐటీ డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది.

కొత్త ఐటీ పోర్టల్‌లో లోపాలు బయటపడుతున్న వేళ.. పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ డిపార్ట్‌మెంట్ మరో కొత్త సదుపాయం కల్పించింది. ఫేస్‌లెస్ లేదా ఈ-అసెస్‌మెంట్ స్కీమ్‌ కింద ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్యాక్స్ చెల్లించేవారు ఫిర్యాదులను నమోదు చేయడానికి మూడు అధికారిక ఈమెయిల్ ఐడీలను ఆదాయపు పన్ను విభాగం శనివారం విడుదల చేసింది. ఈ విషయాన్ని ఐటీ డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. "పన్ను చెల్లింపుదారులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం. ఫేస్‌లెస్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చాం" అని ఐటీ డిపార్ట్‌మెంట్ ట్వీట్‌లో పేర్కొంది.

* ఎలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి?

ఐటీ విభాగం తాజాగా మూడు కొత్త ఈమెయిల్ ఐడీలను ఫిర్యాదులను నమోదు చేయడానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం మూడు రకాల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఈ మూడు మెయిల్ ఐడీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

1. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ ఫిర్యాదుల కోసం samadhan.faceless.assessment@incometax.gov.in ఐడీని ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.

2. ఫేస్‌లెస్ పెనాల్టీకి సంబంధించిన వివరాలపై ఫిర్యాదు చేసేందుకు samadhan.faceless.penalty@incometax.gov.in ఐడీని ట్యాక్స్ చెల్లింపుదారులు ఉపయోగించుకోవచ్చు.

3. ఫేస్‌లెస్ అప్పీల్స్‌పై

samadhan.faceless.appeal@incometax.gov.in ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీమ్ అంటే?

ట్యాక్స్ చెల్లింపులపై ఫిర్యాదు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు సంబంధిత ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సిస్టమ్‌ను ఐటీ విభాగం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారుడు లేదా అసెస్సీ.. ట్యాక్స్‌కు సంబంధించిన విషయాల కోసం ఐటీ అధికారులను కలవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఎలక్ట్రానిక్ బేస్డ్ సిస్టం ద్వారా సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ సిస్టం.. రిస్క్ పారామీటర్‌లు, మిస్‌మ్యాచ్‌ల ఆధారంగా ట్యాక్స్ రిటర్న్‌లను ఎంచుకొని పరిశీలిస్తుంది. వాటిని వివిధ నగరాల్లోని ఐటీ అధికారుల బృందానికి ర్యాండమ్‌గా కేటాయిస్తుంది. అనంతరం దాన్ని రివ్యూ చేసేందుకు.. ర్యాండమ్‌గా మరొక ప్రాంతంలోని అధికారులకు బదిలీ చేస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది.

First published:

Tags: Business