news18-telugu
Updated: December 3, 2019, 12:03 PM IST
షణ్ముగ సుబ్రహ్మణియన్ (credit - FB - Shanmuga Subramanian)
Chandrayaan-2 Vikram Lander : మనందరికీ గుర్తుంది... ఇస్రో పంపిన చంద్రయాన్-2 మిషన్‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్... సెప్టెంబర్‌లో చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతూ... సిగ్నల్స్ కోల్పోయి... క్రాష్ ల్యాండ్ అయ్యిందని. ఐతే... అది ఎక్కడ పడిందో ఇస్రోతోపాటూ... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా కనిపెట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఖగోళ శాస్త్రవేత్తలు ఆ ల్యాండర్‌ను కనిపెట్టలేక ఆశలు వదిలేసుకున్నారు. అలాంటిది... 700 కోట్ల మందిలో ఒక్క కుర్రాడు మాత్రం విక్రమ్ ల్యాండర్‌కి చెందిన ఓ విడి భాగాన్ని కనిపెట్టాడు. అతను ఎవరో కాదు... తమిళనాడుకు చెందిన ఇంజినీర్, బ్లాగర్, టెకీ అయిన షణ్ముగ సుబ్రహ్మణియన్. తను కనిపెట్టిన విడి భాగానికి సంబంధించిన వివరాల్ని నాసాకు చెప్పగా... వెంటనే నాసా స్పందించింది. అది విక్రమ్ ల్యాండర్‌కి చెందిన విడిభాగమే అని గుర్తించింది. అక్కడ చుట్టుపక్కల వెతకగా... విక్రమ్ ల్యాండర్ కనిపించింది. అంతేకాదు... దాని చుట్టుపక్కల దాదాపు 24 విడిభాగాల్ని నాసా గుర్తించింది. ఇస్రో... విక్రమ్ ల్యాండర్ ఎక్కడ దిగాలని అనుకుందో... అక్కడకు దగ్గర్లోనే అది కూలినట్లుగా నాసా స్పష్టం చేసింది.

షణ్ముగ సుబ్రహ్మణియన్ (credit - twitter - ANI)
ఇక్కడ మనం షణ్ముగ సుబ్రహ్మణియన్‌ను మెచ్చుకోవాలి. ఎందుకంటే... సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టడం తమ వల్ల కావట్లేదన్న నాసా... దమ్ముంటే ఎవరైనా కనిపెట్టండి అని సరదాగా ఛాలెంజ్ విసిరింది. అప్పటి నుంచీ అదే విషయంపై తనదైన సెర్చ్ చేసిన షణ్ముగ... రెండు నెలలపాటూ నానా కష్టాలు పడి... విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టాడు. తన ఫైండింగ్‌ను నాసా నిజమేనని తేల్చడంతో ఎంతో థ్రిల్ ఫీలవుతున్నాడు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించిన నాసా... (credit - twitter - nasa)
తను సెర్చ్ చెయ్యాలి అని అనుకున్న తర్వాత... అతనికి దొరికిన ఫొటోలు కేవలం నాసా తన ల్యూనార్ రిక్కొన్నైశ్సాన్స్ ఆర్బిటర్ (LROC) సైట్లో రిలీజ్ చేస్తున్నవి మాత్రమే. చెన్నైలోని తన కంప్యూటర్ దగ్గర కూర్చొని... రోజూ గంటల తరబడి ఆ ఫొటోలను ఇంచు ఇంచు వెతకసాగాడు. తను అనుకున్నది సాధించడంతో ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నాడు. మెకానికల్ ఇంజినీరైన షణ్ముగ... యాప్ డెవలపర్ కూడా. ఇన్నాళ్లు తన ఫ్రెండ్స్‌కి, చుట్టుపక్కల కొద్ది మందికి మాత్రమే తెలిసిన అతను... రాత్రికి రాత్రి వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. నాసాలోని LRO మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ నుంచీ అతనికి ఈమెయిల్ వచ్చింది. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టే విషయంలో మాకు సమాచారం అందించినందుకు థాంక్స్ అని జాన్ కెల్లర్ తెలిపారు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించిన నాసా... (credit - twitter - nasa)
LROC ఆర్బిటర్కి మూడు కెమెరాలున్నాయి. అవి చందమామ ఉపరితలంపై అత్యంత హై రిజల్యూషన్‌తో ఫొటోలు తీస్తున్నాయి. ఆ ఫొటోలను LRO పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నాసా అప్లోడ్ చేస్తోంది. అవే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు వీలు కలిగించాయి. సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతూ... సిగ్నల్స్ కోల్పోయింది. ఇప్పుడు అది ఎక్కడు ఉందో తెలిసింది కాబట్టి... నాసా త్వరలో దానికి సంబంధించిన పూర్తి ఫొటోలను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
కోలీవుడ్‌లో దూసుకొస్తున్న స్వాతిష్టా క్రిష్ణన్
ఇవి కూడా చదవండి :
ఈశాన్యంలో ఎగరనున్న శాంతి కపోతం... ఉల్ఫాతో కేంద్ర చర్చల్లో పురోగతి
నాసాకు ఝలక్... స్టూడెంట్లకు షాక్... కొంపముంచిన మైనర్...
Morning Diet : ఉదయాన్నే ఏం తినాలి... ఇలా ప్లాన్ వేసుకోండి
Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...
Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...
Published by:
Krishna Kumar N
First published:
December 3, 2019, 12:03 PM IST