హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Hyundai Tucson: హ్యుందాయ్ న్యూ కార్.. ఫోర్త్ జెనరేషన్ టక్సన్ SUV.. లాంచ్ డేట్ ఎప్పుడంటే..!

Hyundai Tucson: హ్యుందాయ్ న్యూ కార్.. ఫోర్త్ జెనరేషన్ టక్సన్ SUV.. లాంచ్ డేట్ ఎప్పుడంటే..!

త్వరలో లాంచ్ కానున్న హ్యుందాయ్ కారు.

త్వరలో లాంచ్ కానున్న హ్యుందాయ్ కారు.

ఫోర్త్ జెనరేషన్ హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson) కారును కంపెనీ ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ లేటెస్ట్ టక్సన్ వెర్షన్‌ను కంపెనీ 2020లోనే ఆవిష్కరించింది. అయితే కరోనా మహమ్మారి, ఇతర కారణాల వల్ల దీని లాంచింగ్ ఆలస్యమైంది.

ఇంకా చదవండి ...

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త కారు లాంచ్ కానుంది. మార్కెట్లోకి కొత్త టక్సన్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఫోర్త్ జెనరేషన్ హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson) కారును కంపెనీ ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఇండియాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ లేటెస్ట్ టక్సన్ వెర్షన్‌ను కంపెనీ 2020లోనే ఆవిష్కరించింది. అయితే కరోనా మహమ్మారి, ఇతర కారణాల వల్ల దీని లాంచింగ్ ఆలస్యమైంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ అప్‌డేటెడ్ SUVని కంపెనీ జూలై 13న లాంచ్ చేసే అవకాశం ఉంది. కొత్త మోడల్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించింది. అయితే దీని ప్రీ-లాంచ్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.

2022 న్యూ-జెన్ టక్సన్‌ ఆగస్టులో మార్కెట్లోకి రావచ్చని టైమ్స్‌ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ సరికొత్త కారును హ్యుందాయ్ 2020 సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. అయితే ఇండియన్ మార్కెట్లో మునుపటి తరం మోడళ్లను కూడా కంపెనీ కొనసాగిస్తోంది. తాజాగా రానున్న లేటెస్ట్ వెర్షన్ టక్సన్.. ఫారిన్-స్పెక్ లుక్‌లో ఆకట్టుకోనుంది. స్పెషల్ సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్‌ ఆధారంగా హ్యుందాయ్ ఈ కారును డిజైన్ చేసింది. స్టైలింగ్‌కు సంబంధించినంతవరకు ప్రస్తుత జెనరేషన్ వెర్షన్‌ కంటే అప్‌డేటెడ్‌గా కనిపిస్తోంది. ఈ SUV ముందు భాగంలో పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్‌ ఉంటుంది. దీనికి LED DRLలు ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. మెయిన్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు బంపర్‌ నుంచి కిందకు ఉన్నాయి.


కారు వెనుకవైపు డ్యూయల్ T-షేప్డ్ టెయిల్ లైట్లు LED బార్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. వెనుక విండ్‌షీల్డ్ కింది భాగంలో హ్యుందాయ్ ఎంబ్లెమ్ ఉంటుంది. రియర్ వైపర్ SUV వెనుక స్పాయిలర్ కింద ఉంటుంది. స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, బాడీ క్లాడింగ్ వంటివి అవుట్‌గోయింగ్ వెర్షన్ కంటే స్పోర్టివ్‌గా, మరింత డైనమిక్‌గా కనిపిస్తున్నాయి. హ్యుందాయ్ ఇండియా-స్పెక్ కొత్త టక్సన్ ఫీచర్లను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే ఇది 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే పరిమాణంలో ఉన్న ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెంటిలేషన్ ఫంక్షన్‌తో ముందు వరుస సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైనవి ఈ కారు అదనపు స్పెసిఫికేషన్లు.

కొత్త టక్సన్ 2.0-లీటర్ NA పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ పవర్‌ట్రైన్‌లలో వస్తుంది. పెట్రోల్ యూనిట్ 152 PS గరిష్ట శక్తిని, 192 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్ రేంజ్ 185 PS/400 Nm యూనిట్లు. ఈ రెండు ఇంజన్‌లు ప్రామాణికంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉండవచ్చు. అయితే టాప్-ఎండ్ ట్రిమ్‌లో ఆప్షనల్ 4WD సెటప్ కూడా ఉంటుంది. దీని ధర రూ.25 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. 2022 హ్యుందాయ్ టక్సన్ కారు జీప్ కంపాస్, సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ వంటి వాటితో పోటీపడనుంది.

First published:

Tags: Auto News, Best cars, Hyundai, New car

ఉత్తమ కథలు