హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Hyundai: కొత్త డిజైన్‌తో వస్తున్న చేస్తున్న.. స్టార్‌గేజర్ కారుతో ఎంట్రీ

Hyundai: కొత్త డిజైన్‌తో వస్తున్న చేస్తున్న.. స్టార్‌గేజర్ కారుతో ఎంట్రీ

హ్యుందాయ్ కొత్త కారు రిలీజ్.

హ్యుందాయ్ కొత్త కారు రిలీజ్.

ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS)- 2022లో హ్యుందాయ్ సరికొత్త స్టార్‌గేజర్ MPV (Stargazer MPV) కారును ఆవిష్కరించనుంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లలో దీన్ని రిలీజ్ చేయనుంది.

హ్యుందాయ్ కంపెనీ కార్లకు ఇండియాలో మంచి మార్కెటింగ్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి కొత్త కార్లు ఎప్పుడు వస్తుంటాయా అని ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి తెలిసినవారు ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో హ్యుందాయ్ మరో కొత్త కారును త్వరలో ఆవిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానున్న గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS)- 2022లో హ్యుందాయ్ సరికొత్త స్టార్‌గేజర్ MPV (Stargazer MPV) కారును ఆవిష్కరించనుంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లలో దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ఈ MPV వెహికల్ డిజైన్, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ వివరాలు లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

లీక్ అయిన వీడియో ప్రకారం, హ్యుందాయ్ స్టార్‌గేజర్ కొత్త పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, ముందు భాగంలో గ్రిల్ చుట్టూ LED స్ట్రిప్‌ వంటి స్పెషల్ ఫీచర్లతో రానుంది. ముందు భాగంలో కర్వీ బానెట్‌ యాంగులర్ స్టైలింగ్‌ ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటోంది.


వెనుక భాగంలో కూడా డిజైనింగ్ ప్రత్యేకంగా ఉంది. ఈ కారుకు హెగ్జాగోనల్ విండ్‌షీల్డ్, బూట్ లిడ్ చుట్టూ LED ఇన్సర్ట్‌లతో పాటు ట్రయాంగులర్ షేప్డ్ టెయిల్-ల్యాంప్స్‌ ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతోపాటు విజువల్స్‌లో కారు ఇంటీరియర్ కూడా కొంతమేరకు కనిపిస్తోంది. రాబోయే హ్యుందాయ్ స్టార్‌గేజర్ ఫ్రీ-ఫ్లోయింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AC వెంట్స్, ఇతర ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఈ కారు యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, లెదర్ సీట్ అప్‌హోల్‌స్టరీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

వివిధ మీడియా నివేదికల ప్రకారం MPV కారు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)తో వచ్చే అవకాశం ఉంది. వీడియోలో కనిపించిన వివరాలను బట్టి, హ్యుందాయ్ స్టార్‌గేజర్ MPV ఆరు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఉండగా, మూడో వరుసలో బెంచ్ తరహా సీట్లు ఉంటాయి. ఇంజన్ పరంగా కూడా వెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. MPV హ్యుందాయ్ క్రెటా మాదిరిగానే 1.5-లీటర్ 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని భావిస్తున్నారు. ట్రాన్స్‌మిషన్ డ్యూటీలను మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్లు నిర్వహిస్తాయి. ఫీచర్లు, ఇంజన్ స్పెసిఫికేషన్‌ల గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ హ్యుందాయ్ స్టార్‌గేజర్ MPV గురించి కంపెనీ మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

కొత్త MPV సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్‌ను కవర్ చేస్తుంది. ఈ మార్కెట్లలో హ్యుందాయ్ ట్రాజెట్ మాదిరిగా బ్రాండ్ లెగసీని కొత్త మోడల్ ముందుకు తీసుకువెళ్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. MPV ఇండియన్ మార్కెట్లో విడుదలైతే, మారుతి సుజుకి ఎర్టిగా నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది.

First published:

Tags: Auto News, CAR, Hyundai, New cars

ఉత్తమ కథలు