Hyundai Hydrogen Car: హ్యుందాయ్ హైడ్రోజన్ కారు...పెట్రోల్, డీజిల్ కన్నా చౌక ఇంధనం..

Hyundai Hydrogen Car: హ్యుందాయ్ హైడ్రోజన్ కారు...పెట్రోల్, డీజిల్ కన్నా చౌక ఇంధనం..

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతోంది. అంతేకాదు కొరియర్‌ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్లైయింగ్‌ కార్‌ టెక్నాలజీపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో టెక్నాలజీపై దృష్టి సారించింది.

 • Share this:
  ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతోంది. అంతేకాదు  కొరియర్‌ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్లైయింగ్‌ కార్‌ టెక్నాలజీపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో టెక్నాలజీపై దృష్టి సారించింది. హైడ్రోజన్‌తో నడిచే కారును మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌  కార్ల ట్రెండ్‌ నడుస్తోంది. అమెరికా, చైనా మొదలు అమెరికా వరకు మారుతి నుంచి జనరల్‌ మెటార్స్‌ వరకు అన్ని కంపెనీలు ఈవీ టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇక టెస్లా కంపెనీ ఎస్‌ ప్లెయిడ్‌ కార్లయితే కొత్త ట్రెండ్‌నే క్రియేట్‌ చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈవీ కార్లకే పరిమితం అవుతామంటూ ప్రముఖ కార్ల కంపెనీ  ఆడి ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇఫ్పుడు హ్యుందాయ్‌ సంస్థ వీటన్నింటికీ  భిన్నంగా హైడ్రోజన్‌ కార్ల తయారీపై ఫోకస్‌ పెట్టింది.

  ఎలక్ట్రిక్ బ్యాటరీల హైడ్రోజన్‌ సెల్స్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈవీలతో పోల్చితే హైడ్రోజన్‌ సెల్స్‌ ఆధారిత ఇంజన్ల పనితీరు కొంచం సంక్లిష్టమైంది. ఆ టెక్నాలజీ ఇంకా కమర్షియల్‌గా ఇంకా వినియోగంలోకి రాలేదు. కానీ హ్యందాయ్‌ ఓ అడుగు ముందుకు వేసి హ్రైడోజన్‌ వేవ్‌ పేరుతో కారుని సిద్ధం చేసింది. నిజానికి రవాణా రంగంలో హైడ్రోజన్ ఇంధనాన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగం నుంచే మూడింట ఒక వంతు కార్బన్ ఉద్గారాలు గాల్లోకి వెలువడుతున్నాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాలతో వెలువడే ఈ గ్రీన్ హౌస్ వాయువులను హైడ్రోజన్ ఫ్యూయెల్‌ ద్వారా కట్టడి చేయవచ్చు. ఇది సంప్రదాయ విద్యుత్ వాహనాలకంటే మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ మన దేశంలో హైడ్రోజన్ టెక్నాలజీ ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీంతో ఈ ప్రతిపాదిత హైడ్రోజన్ ఇంధనం పూర్తిగా కార్యరూపం దాల్చేందుకు చాలా సమయం పట్టవచ్చు.

  అంతేకాదు హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలు పూర్తిగా తగ్గిపోతాయి. పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది. ఒక్కసారి హైడ్రోజన్ వెహికిల్స్ ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. CNG మాదిరిగానే హైడ్రోజన్‌ను వాహనాల్లోని ట్యాంకుల్లో నింపుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో వాడే లిథియం అయాన్ బ్యాటరీలకంటే తేలికగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణించే రవాణా ట్రక్కులు, కమర్షియల్ వెహికిల్స్‌కు వీటి వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ ఇంధనాన్ని కేవలం ఐదు నిమిషాల్లోనే నింపుకోవచ్చు.

  ఇదిలా ఉంటే హైడ్రోజన్‌ సెల్‌ బేస్డ్‌ కాన్సెప్టు కారుకు సంబంధించిన విశేషాలు సెప్టెంబరు 7న హ్యందాయ్‌ సంస్థ వెల్లడించనుంది. ఆ తర్వాత కొరియాలోని గొయాంగ్‌లో ఈ కారుకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించనుంది. ఈ మేరకు హ్యుందాయ్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
  Published by:Krishna Adithya
  First published: