Home /News /technology /

HYUNDAI ENGINEERS ARE WORKING ON A VEHICLE TIGER X 1 THAT CAN TRAVERSE EVEN THE MOST DIFFICULT TERRAIN NS GH

Hyundai Tiger X-1: ఆ కారుకు చక్రాలతో పాటు కాళ్లు.. దూసుకెళ్లడమే కాదు నడుస్తుంది కూడా.. మార్కెట్లోకి ఎప్పుడంటే..

Tiger X-1(photo:Youtube)

Tiger X-1(photo:Youtube)

కారే కాళ్లపై నడిస్తే ఎలా ఉంటుంది? గమ్మత్తుగా ఉంది కదూ వింటుంటే.. అవును హ్యూండాయ్ సంస్థ ఇలాంటి అధునాతన కారును రూపొందిస్తోంది. ఆ కంపెనీకి చెందిన ఇంజినీర్లు కష్టతరమైన మార్గాల్లోనూ ప్రయాణించే కారును నిర్మిస్తున్నారు.

ఆఫ్ రోడ్లు వచ్చినా అధునాతన ఎస్ యూవీలతో మంచి రైడింగ్ అనుభూతి పొందవచ్చు. మరి ఎస్ యూవీలు కూడా వెళ్లలేని గుంతలు, రాళ్లు ఉన్న మార్గాల గుండా వెళ్లాలంటే ఏం చేయాలి. ఏముంది కారు దిగి నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది అని అనుకుంటున్నారా? అలా కాకుండా కారే కాళ్లపై నడిస్తే ఎలా ఉంటుంది. గమ్మత్తుగా ఉంది కదూ వింటుంటే అవును హ్యూండాయ్ సంస్థ ఇలాంటి అధునాతన కారును రూపొందిస్తోంది. ఆ కంపెనీకి చెందిన ఇంజినీర్లు కష్టతరమైన మార్గాల్లోనూ ప్రయాణించే కారును నిర్మిస్తున్నారు. అదే హ్యూండాయ్ టైగర్ ఎక్స్-1. సాధారణ కారు మాదిరే దీనికి కూడా నాలుగు చక్రాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్ తో నడిచే ఈ వాహనం నాలుగు చివర్లో కాలు మాదిరి వంగి ఉంటుంది. ఆ కాళ్ల చివర్లో చక్రాలు ఉంటాయి. రోడ్డుపై లాగే వీలైనంత వరకు చక్రాలపైనే నడుస్తుంది. అవరోధాలు, గుంతలు వచ్చినప్పుడు ఆ చక్రాలు వాటంతట అవే పైకి ముడుచుకుని కాళ్ల మాదిరి నడిచే విధంగా డిజైన్ చేశారు. మార్గానికి తగినట్లు ఈ కాళ్లు వంగి కార్గో ఏరియా స్థాయిని పెంచుతాయి.

అంతేకాకుండా ఈ కారులోని చక్రాలు లేదా కాళ్లు ఉపయోగించి ఏ దిశలోనైనా వెళ్లవచ్చు. ముందుకు, వెనుకకు, పక్కకు కదిలించవచ్చు. ఈ టైగర్ ఎక్స్-1 వాహనాన్ని హ్యూండాయ్ సంస్థ క్లిష్టమైన పరిస్థితులప్పుడు ఉపయోగించేందుకు వీలుగా నిర్మిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు లాంటివి సంభవించినప్పుడు ఈ వాకింగ్ కార్గో సాయంతో ప్రజలకు అవసరమైన వస్తువులను సరఫరా చేయొచ్చు. అయితే ఈ వాహనం ద్వారా ప్రజలను తీసుకెళ్లలేడం కుదరదు. కేవలం వస్తువుల పంపిణికే. ఈ ప్రయోగాత్మక టైగర్ వాహనాన్ని మానవ రహిత వైమానిక డ్రోన్ తో అనుసంధానించవచ్చు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలకు తీసుకెళ్లవచ్చని హ్యుండాయ్ సంస్థ తెలిపింది. టైగర్, డ్రోన్ ఒకదానికొకరి అవసరమయ్యే విధంగా బ్యాటరీలను ఛార్జ్ చేయగలవు.

ఈ కాన్సెప్ హ్యూండాయ్ ఎలివేట్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలివేట్ కాన్సెప్ట్ ను మొదటిసారిగా 2019 కంజూమర్ ఎలక్ట్రానిక్స్ షో యానిమేషన్ గా ఆవిష్కరించారు.  ఇది మరోక వాకింగ్ కాన్సెప్ట్ కారు. ఎలివేట్ కాన్సెప్ట్ ఆర్ట్ ప్రజలను తీసుకెళ్లడానికి రూపొందించిన భారీ వాహనం. అయితే టైగర్ మాత్రం సరుకులు, వస్తువులను మాత్రమే తీసుకెళ్లడానికి వినియోగించవచ్చు. ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరోక ఐదేళ్ల సమయం పడుతుంది. ప్రజలను సురక్షితంగా తీసుకెళ్లగల ఎలివేట్ లాంటి కార్లు రావడానికి ఇంకా ఎక్కువగా సమయం పడుతుంది.

టైగర్ హ్యూండాయ్ ను కాలిఫోర్నియాకు చెందిన న్యూహారిజన్స్ స్టూడియో అభివృద్ధి చేస్తోంది. ఇది హ్యూండాయ్ మోటార్ గ్రూపుకు చెందిన విభాగం. సాధారణ కార్లు, ట్రక్కులు చేయలేని పనులు, అవి వెళ్లలేని ప్రదేశాలకు చేరే వాహనాలను ఈ సంస్థ డిజైన్ చేస్తుంది. ఇలాంటి వాహనాలు చంద్రుడు లేదా ఇతర గ్రహాల ఉపరితలంపై అన్వేషణకు ఉపయోగపడతాయని న్యూహారిజన్స్ స్టూడియో డైరెకట్ర్ జాన్ సూహ్ చెప్పారు. వీల్ చైర్లో ఉండే ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేలా కాళ్లను పైకిలేపడం, తగ్గించడం వంటివి ట్యాక్సీలుగా ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

రోబోటిక్స్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ పై నియంత్రణము తీసుకోవడానికి హ్యూండాయ్ చర్చలు జరుపుతోంది. ఐతే బోస్టన్ డైనమిక్స్ ఈ ప్రాజెక్టులో పాల్గొనలేదని హ్యూండాయ్ అధికారులు తెలిపారు. బదులుగా డిజైన్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆటోడెస్క్, వెహికల్ కాన్సెప్ట్ సంస్థ సుండ్ బర్గ్ ఫెరార్ తో కలిసి హ్యూండాయ్ పనిచేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Cars, Hyundai

తదుపరి వార్తలు