హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Hyundai: దీపావళికి సర్వీస్ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

Hyundai: దీపావళికి సర్వీస్ ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్

హ్యుందాయ్ i20(Photo: Hyundai)

హ్యుందాయ్ i20(Photo: Hyundai)

దసరా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సీజన్‌ సందర్భంగా వాహన తయారీ సంస్థలు వివిధ ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించాయి.

దసరా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సీజన్‌ సందర్భంగా వాహన తయారీ సంస్థలు వివిధ ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించాయి. చాలా అంస్థలు దీపావళి వరకు ఆఫర్లకు పొడిగించాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కూడా తమ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా కార్ల అలంకరణ(beautification)పై ప్రత్యేక సర్వీస్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ వాహన తయారీ సంస్థ ‘ప్రీ దివాళీ క్యాంప్‌’ పేరుతో అందిస్తున్న ఆఫర్లను విడుదల చేసింది. ఈ సర్వీస్ ఆఫర్లు రూ.263 నుంచి ప్రారంభమవుతున్నాయి.

* ప్రీ దీపావళి క్యాంప్ ఆఫర్‌లు

పెయింట్ రక్షణ (paint protection)పై 20 శాతం, ఎక్స్టీరియర్ బ్యూటిఫికేషన్‌పై 20 శాతం, ఇంటీరియర్ ఎన్‌రిచ్‌మెంట్‌పై 20 శాతం తగ్గింపులను హ్యుందాయ్ ప్రకటించింది. వీటితో పాటు ప్రీమియం ఇంటీరియర్ ఫోమ్ క్లీనింగ్‌పై 20 శాతం డిస్కౌంట్ను వినియోగదారులు పొందవచ్చు. ఇంజిన్ క్లీనింగ్/ డ్రెస్సింగ్‌పై 20 శాతం, విండ్‌స్క్రీన్ సర్వీస్‌పై 20 శాతం తగ్గింపులను కూడా ఆ సంస్థ అందించనుంది. ఈ ఆఫర్లు కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయని హ్యుందాయ్ తెలిపింది.

* హ్యుందాయ్ i20 విడుదల సందర్భంగా...

కొత్త i20 కారును మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఈ ఆఫర్లకు సంబంధించిన ప్రకటనను హ్యుందాయ్ విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సిన జెనీవా మోటార్ షోలోనే కొత్త హ్యాచ్‌బ్యాక్‌ i20 కారును ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది. కానీ COVID-19 కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. కొత్త i20 కారు మొత్తం 13 వేరియంట్లలో లభిస్తుంది. దీనికి మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం ఉన్న ఆఫర్లు, ధరల వివరాలను హ్యుందాయ్ విడుదల చేసింది.

* హ్యుందాయ్ i20 ధరలు (వేరియంట్ వారీగా- ఎక్స్ షోరూం ధరలు)..

Hyundai i20 1.2 P MT Magna - Rs 6,79,900

Hyundai i20 1.2 P MT Sportz - Rs 7,59,900

Hyundai i20 1.2 P MT Asta - Rs 8,69,900

Hyundai i20 1.2 P MT Asta (O) - Rs 9,19,900

Hyundai i20 1.2 P iVT Sportz - Rs 8,59,900

Hyundai i20 1.2 P iVT Asta - Rs 9,69,900

Hyundai i20 1.0 Turbo iMT Sportz - Rs 8,79,900

Hyundai i20 1.0 Turbo iMT Asta - Rs 9,89,900

Hyundai i20 1.0 Turbo DCT Asta - Rs 10,66,900

Hyundai i20 1.0 Turbo DCT Asta (O) - Rs 11,17,900

Hyundai i20 1.5 D MT Magna - Rs 8,19,900

Hyundai i20 1.5 D MT Sportz - Rs 8,99,900

Hyundai i20 1.5 D MT Asta (O) - Rs 10,59,900

Published by:Sumanth Kanukula
First published:

Tags: Automobiles

ఉత్తమ కథలు