Hyperloop Train: "హైప‌ర్" టెక్నాల‌జీ.. గంట‌న్న‌ర‌లో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లొచ్చు

(ప్రతీకాత్మక చిత్రం)

ఢిల్లీ(Delhi) నుంచి ముంబైకి(Mumbai) 1,153 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ప్రయాణిస్తే చాలా గంటలు పడుతుంది. కానీ అదే హైప‌ర్ లూప్ పోర్ట‌ల్(portal)లో ట్రైన్లో ప్రయాణిస్తే కేవలం గంటన్నరలో మీరు గమ్యం చేరుతారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ సాంకేతికత గురించి తెలసుకుందాం.

  • Share this:
    కాలం మారుతోంది.. నిరంత‌రం కొత్తద‌నాన్ని వేగాన్ని కోరుకుంటుంది. అంత‌ర్జాతీయంగా ర‌వాణా(Transport) రంగంలోనూ పెద్ద మార్పులు వ‌స్తున్నాయి. వేగ‌వంత‌మైన రవాణా ప్ర‌స్తుతం ఎంతో అవ‌స‌రం ఈ నేప‌థ్యంలో అతిపెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో హైప‌ర్‌లూప్‌ల నిర్మించే ప‌నిలో ప‌డ్డాయి. అందులో భాగంగా ప్ర‌స్తుతం వ‌ర్జిన్ గ్రూప్ హైపర్ లూప్ రైలు(Rail) అభివృద్ధి పనులను నిర్వ‌హిస్తోంది. 2014 నుంచి ఈ ప‌నులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌నులు ట్ర‌య‌ల్(Trail) ద‌శ‌లోనే ఉన్నాయి. ఈ హైప‌ర్‌లైన్ పూర్త‌యితే క‌చ్చితంగా ర‌వాణా రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి.

    Samsung Galaxy A21 Simple: శుభవార్త చెప్పిన శామ్‌సంగ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్ విడుద‌ల‌


    ఏమిటీ హైప‌ర్ లైన్..
    నూత‌న సాంకేతిక‌త‌ను వినియోగిస్తు వేగ‌వంత‌మైన ర‌వాణాను అందించ‌డ‌మే హైప‌ర్‌లైన్ ప్ర‌త్యేక‌త . ఇది హైస్పీడ్ రైల్ కంటే మూడు రెట్లు వేగ‌వంత‌మైంది. సాధార‌ణ రైలు కంటే ప‌ది రెట్లు వేగంగా గ‌మ్యం చేర‌గ‌ల‌దు. హైపర్ లూప్(Hyperloop) అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్(Aerodynamic) ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది సిద్ధాంతం. హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీని వ‌ర్జిన్ వినియోగించ‌నుంది. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. అంటే హైప‌ర్ లూప్ గంట‌కు 1,000 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఈ సాంకేతిక‌త(Technology) వాణిజ్య జెట్ల‌కు పోటీని ఇవ్వ‌గ‌ల‌దు అన‌డంలో ఎటువంటి సందేహం అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ట్ర‌య‌ల్ ర‌న్ జ‌రుగుతున్న ప్ర‌యోగం హైప‌ర్ లూప్ పోర్ట‌ల్‌లోని రూట్ అంచనా ఈ విధంగా ఉంది. ఢిల్లీ(Delhi) నుంచి ముంబైకి(Mumbai) 1,153 కిలోమీట‌ర్ల దూరం ఉంది. మీరు హైప‌ర్ లూప్ పోర్ట‌ల్(portal)  ప్ర‌యాణిస్తే కేవ‌లం గంటా 22 నిమిషాల్లో ఈ దూరాన్ని చేర‌వ‌చ్చంటున్నారు. టెక్నాల‌జీ ఇంజ‌నీర్‌లు.
    Published by:Sharath Chandra
    First published: