Home /News /technology /

Mileage Booster: వాహనాల మైలేజీని పెంచే బూస్టర్.. హైదరాబాదీ అద్భుత ఆవిష్కరణ

Mileage Booster: వాహనాల మైలేజీని పెంచే బూస్టర్.. హైదరాబాదీ అద్భుత ఆవిష్కరణ

5M టెక్నాలజీని తయారు చేసిన డేవిడ్ (ANI: Photo)

5M టెక్నాలజీని తయారు చేసిన డేవిడ్ (ANI: Photo)

2014లో ఈ అద్భుత ఆవిష్కరణ జరగ్గా, 2008 నుంచే కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా కర్బన వ్యర్థాల ఉత్పత్తి తగ్గించేలా పరిశోధనలు చేశారు.

మనందరికీ బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం. ఎంతో ఖర్చు చేసి బండి కొన్న మొదటి రోజు నుంచి అపురూపంగా చూసుకుంటాం. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తూ, మైలేజ్ బాగా రావాలని సున్నితంగా నడుపుతుంటాం. కానీ కొద్ది కాలానికి బైక్ కాస్త నెమ్మదించడం, మైలేజ్ తక్కువగా రావడం వంటివి గమనిస్తుంటాం. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని భావించారు హైదరాబాద్‌కు చెందిన మెషిన్ టెక్కీ డేవిడ్ ఎష్కోల్. ఈ క్రమంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికాడు. అదేంటో మీరే తెలుసుకోండి.

డేవిడ్ ఎష్కోల్ అభివృద్ధి చేసిన 5M మైలేజ్ బూస్టర్ వ్యవస్థ ద్వారా ఇంజిన్ నుంచి విడుదలయ్యే కార్బన్ వ్యర్థాలు తగ్గడమే కాకుండా మైలేజీ కూడా ఎక్కువగా వస్తుంది. 5M అంటే ఐదు రకాల ప్రయోజనాలు చేకూర్చే వ్యవస్థ అని అర్థం. ఇది మైలేజీని పెంచి, బైక్ పిక్ అప్ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. డ్రైవ్ చేసేటప్పుడు స్మూత్, టార్క్ వంటివి బాగుండడమే కాకుండా తక్కువ మోతాదులో కార్బన్ వ్యర్థాలు విడుదలవుతాయని డేవిడ్ తెలిపారు.

ఈ ఆవిష్కరణ పనితీరు గురించి డేవిడ్ వివరించారు. 5M మైలేజ్ బూస్టర్ వ్యవస్థ ఇంజిన్‌తో పాటు పనిచేస్తుంది. ఇంజిన్ ను ఏమాత్రం తెరవకుండా ఇన్టేక్ మేనిఫోల్డ్ ద్వారా ఇంజిన్ వ్యవస్థకు అమరుస్తారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్ ద్వారా ఇంజిన్ కు పంపిస్తామని తెలిపారు. 2014లో ఈ అద్భుత ఆవిష్కరణ జరగ్గా, 2008 నుంచే కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా కర్బన వ్యర్థాల ఉత్పత్తి తగ్గించేలా పరిశోధనలు చేశారు.

ఈ మెషిన్ టెక్కీ ఇప్పటి వరకు దాదాపు 8,000 వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్ వ్యవస్థను అమర్చారు. అందులో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల బస్సులు, ట్రక్కులు ఉండడం విశేషం. 100సీసీ నుంచి 10,000సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్ వ్యవస్థను అమర్చవచ్చని తెలిపారు. సాధారణంగా ఒక వెహికల్ 100 యూనిట్స్ రూపంలో ఇంధనాన్ని తీసుకుంటే అందులో కేవలం 12.5 శాతం మాత్రమే రన్నింగ్ లో చక్రాలకు వెళ్తోంది. మిగిలింది..మెషిన్ ఫ్రిక్షన్ ను వివిధ సందర్భాల్లో అధిగమించడానికి ఇంజిన్ వాడుతోంది. ఫ్రిక్షన్ పాయింట్స్ పై నిర్దిష్ట సమయంలో పని చేసి తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకునేలా 5M మైలేజ్ బూస్టర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఏదైనా మంచి ఆటోమొబైల్ తయారీ సంస్థ కోసం చూస్తున్నానని.. ఈ టెక్నాలజీ వల్ల వెహికల్స్ కు మంచి మైలేజీ, తక్కువ కార్బన్ వ్యర్థాలు విడుదలవుతాయని డేవిడ్ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bikes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు