ఇక మొబైల్‌లో మెట్రో రైళ్ల టికెట్లు... ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు...

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైళ్ల వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇవాళ్టి నుంచీ క్యూఆర్ టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా మెట్రో రైలు టికెట్ కావాలంటే మొబైల్ ద్వారా కొనుక్కోవచ్చు.

news18-telugu
Updated: December 23, 2019, 6:43 AM IST
ఇక మొబైల్‌లో మెట్రో రైళ్ల టికెట్లు... ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు...
హైదరాబాద్ మెట్రో
  • Share this:
Hyderabad Metro Rail : ఇప్పటివరకూ మెట్రో రైలు టికెట్ కావాలంటే... సంబంధిత స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్ కొనుక్కుంటే చాలు. ఓ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్‌ను స్కాన్ చేయించడం ద్వారా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. అంటే మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోనే... మెట్రో రైలు టికెట్ అయిపోతుందన్నమాట. క్యూఆర్‌ కోడ్‌ టికెట్‌ కార్యక్రమాన్ని మెట్రో ఎండీ ఎన్ వి ఎస్‌ రెడ్డి నేడు హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ప్రయాణికులంతా... ఆన్‌లైన్‌లో టికెట్ కొనుక్కోవచ్చు. తద్వారా మెట్రో స్టేషన్‌లో టికెట్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. ఐతే... కొంతమందికి ఆన్‌లైన్‌లో కొనుక్కోవడం రాకపోవచ్చు. అలాంటి వారు... స్టేషన్ దగ్గర టికెట్ కొనుక్కోవచ్చు. ఐతే... అందరికీ సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే క్యూఆర్ కోడ్ విధానం తెస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లలో రోజూ... 4 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ రద్దీ బాగా పెరిగింది. ఆ సమయంలో రైళ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 6న్నర గంటల నుంచీ రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నారు. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నడుస్తున్న జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ కారిడార్‌లో జనవరి చివరికి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 11 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి మీదుగా కోఠి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు దాటడం ఖాయం.
Published by: Krishna Kumar N
First published: December 23, 2019, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading