హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Metro Rail: గుడ్ న్యూస్... ఇక మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు

Metro Rail: గుడ్ న్యూస్... ఇక మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రయాణికులకు ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్-షుగర్ బాక్స్ నెట్‌వర్క్స్ కలిసి మెట్రో రైల్ కారిడార్లలో అన్ని ఏర్పాట్లు చేశాయి.

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై మీరు మెట్రో రైలులో ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. ఉచితంగానే ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్. ఇందుకోసం షుగర్ బాక్స్ నెట్‌వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు. మెట్రో రైలులో ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందించనుంది షుగర్ బాక్స్ నెట్‌వర్క్స్ సంస్థ. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మెట్రో రైలులో ఉన్న ఇంటర్నెట్ సేవల్ని ఉచితంగా పొందొచ్చు. ప్రయాణికులకు ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్-షుగర్ బాక్స్ నెట్‌వర్క్స్ కలిసి మెట్రో రైల్ కారిడార్లలో ఏర్పాట్లు చేశాయి. మొదట 10 మెట్రో స్టేషన్లలో షుగర్‌ బాక్స్‌ మెట్రో లోకల్‌ వై-ఫై సేవలను ప్రారంభించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

జీ5, ఫ్రీ ప్లే యాప్‌తో కేవలం 3 నిమిషాల్లోనే సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు నచ్చిన ఏ కార్యక్రమాలైనా ఎలాంటి అంతరాయం లేకుండా స్ట్రీమింగ్ లేకుండా చూసుకోవచ్చు. ప్రస్తుతం షుగర్ బాక్స్ సేవలను మెట్రోలో 60 రోజుల పాటు ఉచితంగా అందించనున్నారు. 60 రోజులు తరువాత ప్రీమియం రీఛార్జ్ చేసుకోవాలి. రోజూ మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని షుగర్ బాక్స్ సీఈవో రోహిత్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్‌టీసీ, ఏపీఎస్ఆర్‌టీసీ, కర్నాటక ఆర్టీసీతో పాటు ఇతర సంస్థలకు ఇలాంటి ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది షుగర్ బాక్స్ నెట్‌వర్క్స్.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Indian Railways: మీరు ఎక్కిన రైలు చెత్తచెత్తగా ఉందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో కంప్లైంట్ ఇవ్వొచ్చు

Free WiFi: దేశవ్యాప్తంగా 5,500 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై... మీరూ వాడుకోవచ్చు ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డు‌ విషయంలో ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా

First published:

Tags: Brand Hyderabad, Hyderabad, Hyderabad Metro, Hyderabad news, Internet, Metro, Metro Train

ఉత్తమ కథలు