ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1 3జీబీ+32 జీబీ వర్షన్‌పై రూ.1,000, 4జీబీ+64 జీబీ, 6 జీబీ+64 జీబీ వర్షన్లపై రూ.2,000 చొప్పున తగ్గింపు లభిస్తుంది.

news18-telugu
Updated: October 9, 2018, 1:33 PM IST
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏసుస్ జెన్‌ఫోన్ సిరీస్‌లో సూపర్ హిట్టైన మ్యాక్స్ ప్రో(ఎం1) స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరిగే 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018'లో ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1 మూడు వర్షన్లు ఆఫర్ ధరలో అందుబాటులో ఉన్నాయి. 3జీబీ+32 జీబీ వర్షన్‌పై రూ.1,000, 4జీబీ+64 జీబీ, 6 జీబీ+64 జీబీ వర్షన్లపై రూ.2,000 చొప్పున తగ్గింపు లభిస్తుంది.

ఏసుస్ నుంచి వచ్చిన ఫోన్లల్లో జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1 మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. మొదట 3జీబీ+32 జీబీ, 4 జీబీ+64 జీబీ వర్షన్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 6 జీబీ+64 జీబీ వర్షన్ రిలీజ్ చేసి షావోమీకి గట్టిపోటీ ఇచ్చింది తైవాన్‌‌కు చెందిన ఏసుస్ కంపెనీ. ఇప్పుడు మిగతా కంపెనీలతో పోటీపడి భారీగా ధరల్ని తగ్గించింది. స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపుతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డులతో ఈఎంఐ సదుపాయం, నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ లాంటి ఆఫర్లున్నాయి.

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో (ఎం1)
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(2160 x 1080) ఎల్సీడీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, అడ్రినో 509, 1.8 గిగాహెర్జ్
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీరియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1
కలర్: బ్లాక్, గ్రే
సిమ్: డ్యూయెల్ సిమ్
ధర:
3జీబీ+32 జీబీ: ప్రస్తుత ధర... రూ.10,999, ఆఫర్ ధర... రూ.9,999
4జీబీ+64 జీబీ: ప్రస్తుత ధర... రూ.12,999 ఆఫర్ ధర... రూ.10,999

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో (ఎం1) 6 జీబీ+64 జీబీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(2160 x 1080) ఎల్సీడీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, అడ్రినో 509, 1.8 గిగాహెర్జ్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీ
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1
కలర్: బ్లాక్, గ్రే
సిమ్: డ్యూయెల్ సిమ్
ధర: ప్రస్తుత ధర... రూ.14,999 ఆఫర్ ధర... రూ.12,999

ఇవి కూడా చదవండి:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

Video: సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?
Published by: Santhosh Kumar S
First published: October 9, 2018, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading