HUAWEI Y9 PRIME LAUNCHED IN INDIA WITH TRIPLE REAR CAMERA AND SELFIE POP UP CAMERA KNOW PRICE AND SPECIFICATIONS SS
Huawei Y9 Prime: పాప్ అప్ కెమెరాతో హువావే వై9 ప్రైమ్ రిలీజ్... ధర రూ.15,990
Huawei Y9 Prime: పాప్ అప్ కెమెరాతో హువావే వై9 ప్రైమ్ రిలీజ్... ధర రూ.15,990
Huawei Y9 Prime Release | క్రోమా, పూర్విక లాంటి రీటైల్ ఔట్‌లెట్స్‌లో ఆగస్ట్ 5న ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లకు రూ.4,598 విలువైన హువావే స్పోర్ట్ బీసీ హెడ్‌ఫోన్స్, 15,600 పవర్ బ్యాంక్ ఉచితంగా లభిస్తుంది.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్. హువావే కంపెనీ ఇండియాలో వై9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. పాప్-అప్ సెల్ఫీ కెమెరా, నాచ్-లెస్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. హువావే వై9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది మేలోనే ఆవిష్కరించింది కంపెనీ. ఇప్పుడు ఇండియాకు తీసుకొచ్చింది. ట్రిపుల్ రియర్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సీ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. Amazon.in వెబ్సైట్లో ఆగస్ట్ 7న సేల్ మొదలవుతుంది. అమెజాన్ పే నుంచి పేమెంట్ చేస్తే రూ.500, ఎస్బీఐ కార్డు నుంచి పేమెంట్ చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. ఎక్స్ఛేంజ్లో ఈ ఫోన్ కొంటే అదనంగా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఇక క్రోమా, పూర్విక లాంటి రీటైల్ ఔట్‌లెట్స్‌లో ఆగస్ట్ 5న ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లకు రూ.4,598 విలువైన హువావే స్పోర్ట్ బీసీ హెడ్‌ఫోన్స్, 15,600 పవర్ బ్యాంక్ ఉచితంగా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.