Home /News /technology /

HUAWEI P40 P40 PRO AND P40 PRO PLUS WITH DUAL FRONT CAMERAS LAUNCHED PRICE SPECIFICATIONS AND MORE SS GH

Huawei P40: హువావే నుంచి మూడు ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్లు రిలీజ్

Huawei P40: హువావే నుంచి మూడు ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్లు రిలీజ్

Huawei P40: హువావే నుంచి మూడు ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్లు రిలీజ్

Huawei P40 | హువావే పీ40 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

హువావే సంస్థ ప్రీమియం P40 సిరీస్‌లో మరిన్ని మోడళ్లను ఆవిష్కరించింది. వెనిల్లా P40, హువావే P40 ప్రో, హువావే P40 ప్రో ప్లస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. గతేడాది మార్చిలో విడుదల చేసిన P30 సిరీస్ ఫోన్లకు సీక్వెల్‌గా ఇప్పుడు P40 వేరియంట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. వెనిల్లా P40 వేరియంట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయి. P40 ప్రో లో నాలుగు రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రీమియం P40 ప్రో ప్లస్‌లో ఏకంగా ఐదు రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇది 6.58 అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లను చైనాలో అమ్మకానికి ఉంచారు. ఇవి ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే వివరాలను ఆ సంస్థ ప్రకటించలేదు.

వెనిల్లా హువావే P40 మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్లలో, బ్రైట్ బ్లాక్, డార్క్ బ్లూ, డాన్ జిన్, జీరో వైట్, ఫ్రాస్ట్ సిల్వర్ వంటి ఐదు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 6GB+128GB మోడల్లో దీని ప్రారంభ ధర 4,188 చైనీస్ యువాన్లు (సుమారు రూ. 46,200). 8GB+128GB ధర CNY 4,488 (సుమారు రూ. 49,500). 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 4,988 (సుమారు రూ. 55,000).

iQoo U1x: రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఐకూ

WhatsApp: వాట్సప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్... ఇక ఆ టెన్షన్ ఉండదు

హువావే P40 ప్రో కూడా ఐదు కలర్ ఆప్షన్లలో, 8 జిబి ర్యామ్తో లభిస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా CNY 5,988(సుమారు రూ. 66,000), CNY 6,488(సుమారు రూ. 64,800), CNY 7,388(సుమారు రూ. 81,503).

హువావే P40 ప్రో ప్లస్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధర 8 జిబి + 256 జిబి మోడల్‌కు 7,988 యువాన్లు(సుమారు రూ. 88,100). ప్రీమియం 8 జిబి+ 512 జిబి ఆప్షన్ ధర 8,888యువాన్లు (సుమారు రూ. 98,000).

హువావే P40 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ (1,080x2,340 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేతో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత EMUI 10.1తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లో హువావే యాప్ గ్యాలరీ ఉంటుంది. వీటిల్లో గూగుల్ సర్వీస్ యాప్లు ఉండవు. ఇది 8GB RAM, 256GB స్టోరేజ్‌, ఆక్టా-కోర్ కిరిన్ 990 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (AIS) సపోర్ట్ ఉంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌, 3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ (నానో) ఆప్షన్‌తో ఈ ఫోన్‌ 175 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A33 2020: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్... ధర ఎంతంటే

JioPages Web Browser: అదిరిపోయే ఫీచర్స్‌తో జియోపేజెస్ బ్రౌజర్... డౌన్‌లోడ్ చేయండిలా

హువావే P40 Pro 6.58 అంగుళాల full HD+ (1,200x2,640 పిక్సెల్స్) OLED డిస్ప్లేతో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 EMUI 10.1తో పనిచేస్తుంది. ఆక్టా కోర్ కిరిన్ 990 SoC ప్రాసెసర్, 8GB RAM, 512GB స్టోరేజ్‌, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 3D డీప్ సెన్సింగ్, 4 కె వీడియో రికార్డింగ్‌తో పాటు వివిధ షూటింగ్ మోడ్‌లు, ఫిల్టర్‌ ఫీచర్లు ఉన్నాయి. 40W ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్‌లెస్ ఛార్జింగ్‌, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ బరువు 209 గ్రాములు.

హువావే P40 Pro+ డిస్ప్లే, ఇతర ఫీచర్లు హువావే పి40 ప్రో మాదిరిగానే ఉంటాయి. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్గా ఈ ఫోన్‌ లభిస్తుంది. దీంట్లో ఐదు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ సపోర్ట్‌ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 40W వైర్డ్‌, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 5 జి, 4 జి, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వి 5.1, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ (నానో) సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Huawei, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు