హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Huawei Band 6: హువావే ఫిట్​నెస్​ బ్యాండ్ 6 విడుదల..అద్భుతమైన ఫీచర్లు.. వివరాలివే!

Huawei Band 6: హువావే ఫిట్​నెస్​ బ్యాండ్ 6 విడుదల..అద్భుతమైన ఫీచర్లు.. వివరాలివే!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హువావే బ్యాండ్ 6ను ఏప్రిల్​ 2న మలేషియాలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్​లో లార్జ్​ అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని అందించింది. దీనిలో హార్ట్ మానిటరింగ్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి అనేక హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్లను చేర్చింది.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం ఫిట్​నెస్​ బ్యాండ్​లకు యువతలో క్రేజ్​ పెరుగుతోంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్​ తయారీ సంస్థలు పోటాపోటీగా ఫిట్​నెస్​ బ్యాండ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, చైనాకు చెందిన పాపులర్​​ బ్రాండ్​ హువావే మరో ఫిట్​నెస్​ బ్యాండ్​ మార్కెట్‌లోకి లాంఛ్​ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో కూడిన హువావే బ్యాండ్ 6ను ఏప్రిల్​ 2న మలేషియాలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్​లో లార్జ్​ అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని అందించింది. దీనిలో హార్ట్ మానిటరింగ్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి అనేక హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్లను చేర్చింది. ఇది మొత్తం 96కు పైగా వర్కవుట్ మోడ్​లలో లభిస్తుంది.  ఈ బ్యాండ్ 6 ఫిట్​నెస్​ బ్రాండ్​ లుక్స్​, ఫీచర్లు హువావే సబ్​ -బ్రాండ్ అయిన హానర్ వాచ్ ESను పోలి ఉంటాయి. కాగా, హానర్ వాచ్ ES ప్రస్తుతం భారత మార్కెట్​లో రూ.4,999ల వద్ద అమ్ముడవుతోంది. హువావే బ్యాండ్ 6 హువావే బ్యాండ్ 5కి కొనసాగింపుగా వస్తోంది. బ్యాండ్​ 5 విశ్వసనీయ ఫిట్‌నెస్ ట్రాకర్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, బ్యాండ్ 4 స్లిమ్ ప్రొఫైల్​తో అందుబాటులోకి రాగా.. బ్యాండ్ 6 మాత్రం పెద్ద డిస్​ప్లేతో వస్తుంది.

దీనిలో, అది పెద్ద​ AMOLED డిస్​ప్లేను అందించారు. దీని ధర విషయానికొస్తే, హువావే బ్యాండ్ 6 మలేషియాలో RM 219 (భారత మార్కెట్​లో సుమారు రూ .3,800) ధర వద్ద ప్రారంభించబడింది. ఇది అంబర్ సన్‌రైజ్, ఫారెస్ట్ గ్రీన్, గ్రాఫైట్ బ్లాక్ అనే మొత్తం మూడు కలర్​ వేరియంట్లలో లభిస్తుంది. ఏప్రిల్ 4న మలేషియాలోని అధికారిక హువావే స్టోర్‌లో దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే, భారతదేశంలో, ఇతర అంతర్జాతీయ మార్కెట్​లో ఫిట్​నెస్​ బ్యాండ్ ​6ను లాంఛ్​ చేసే విషయంపై మాత్రం హువావే ఎటువంటి స్పష్టతనివ్వలేదు.

స్పెసిఫికేషన్లు

హువావే బ్యాండ్ 6లో అందించిన ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 1.47 ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని డిస్​ప్లే ఏరియా సైజు సాధారణ స్మార్ట్​ వాచ్​ డిస్​ప్లేతో పోలిస్తే 1.48 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇది లో బిజిల్​ 64% స్క్రీన్- టు- బాడీ రేషియోను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని డిస్​ప్లే 282 పీపీఐతో కూడిన 194 x 368 పిక్సెల్స్ హై రిజల్యూషన్​తో వస్తుంది. ఈ బ్యాండ్ 96 వర్కవుట్ మోడ్స్​, ఆల్​ డే SPO2 మానిటరింగ్​, ట్రూస్లీప్ 2.0 స్లీప్ ట్రాకింగ్, ట్రూసీన్ 4.0 24x7 హార్ట్​ రేట్​ మానిటరింగ్​, ట్రూ రిలాక్స్ స్ట్రెస్​ మానిటరింగ్​ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. అంతేకాక, ఆడవారిలో వచ్చే రుతుచక్ర క్రమాన్ని ట్రాక్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.


ఈ బ్యాండ్ 6 స్మార్ట్​వాచ్ చాలా తేలికగా ఉంటుంది. దీన్ని యూవీ సిలికాన్​తో స్కిన్ ఫ్రెండ్లీగా రూపొందించినట్లు హువావే తెలిపింది. దీనిలో డస్ట్​ రెసిస్టన్స్​ని కూడా అందించింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. హువావే బ్యాండ్ 6 ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 14 రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోతే, మాగ్నటిక్​ ఛార్జర్‌తో ఛార్జ్​ చేయవచ్చు. తద్వారా, కేవలం 5 నిమిషాల ఛార్జింగ్​తో 2 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

First published:

Tags: Business, Technology

ఉత్తమ కథలు