హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazfit GTR 2 LTE: అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈ స్మార్ట్​వాచ్​ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Amazfit GTR 2 LTE: అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈ స్మార్ట్​వాచ్​ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ అమాజ్‌ఫిట్ తాజాగా జిటిఆర్ 2 ఎల్‌టిఈ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీనితో పాటు అమాజ్‌ఫిట్ పవర్‌బడ్స?

ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ అమాజ్‌ఫిట్ తాజాగా జిటిఆర్ 2 ఎల్‌టిఈ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీనితో పాటు అమాజ్‌ఫిట్ పవర్‌బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్​ చేసింది. ఈ స్మార్ట్​వాచ్​లో అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఇది eSIM కాల్ ఫంక్షన్‌తో వస్తుంది. దీనిలోని ఫీచర్లన్నీ గతేడాది విడుదలైన అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 మాదిరిగానే ఉంటాయి. అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈ రౌండ్ డయల్, సిలికాన్ స్ట్రిప్​, హార్ట్​ రేట్ మానిటర్​, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్​ (ఎస్‌పిఒ 2) మానిటరింగ్​తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తుంది. దీనిలో- జిపిఎస్‌తో పాటు డ్యూయల్ శాటిలైట్ పొజిషనింగ్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందించారు.

అమాజ్​ ఫిట్​ జిటిఆర్​ 2 ఎల్​టీఈ ధర

కొత్త అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈ గ్లోబల్​ మార్కెట్​లో EUR 249 (సుమారు రూ. 21,900) వద్ద లభిస్తుంది. దీన్ని అమాజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది ఇప్పటికే జర్మనీ, స్పెయిన్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. భారత్‌తో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో దీని లభ్యతపై ఇంకా స్పష్టత లేదు.


స్పెసిఫికేషన్లు

అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈ, అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2ల మధ్య eSIM కాల్ ఫంక్షన్‌ తప్ప అన్ని ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈలో 326 పిపి పిక్సెల్ డెన్సిటీతో కూడిన 1.39 -అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది గరిష్టంగా 450 నిట్‌ బ్రైట్​నెస్​ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సహాయంతో SpO2 కొలవచ్చు. దీనిలో​ ఆపిల్ వాచ్ మాదిరిగానే 3 డి గ్లాస్ ప్రొటెక్షన్​ను అందించింది. దీనితో పాటు యాక్సిలెరోమీటర్, ఎయిర్ ప్రెజర్ సెన్సార్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, హార్ట్​ రేట్​ సెన్సార్లను చేర్చింది. అమాజ్‌ఫిట్ జిటిఆర్ 2 ఎల్‌టిఈలో 12 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్స్​ ప్రీలోడ్ చేసి ఉంటాయి. దీనిలో ఆఫ్‌లైన్ ప్లేబ్యాక్ కోసం 600 పాటల వరకు స్టోరేజ్​ చేయగల 3GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ను అందించారు. ఇక, బ్యాటరీ విషయానికొస్తే.. GTR 2 LTE 417mAh బ్యాటరీ అందించారు. ఇది సుమారు రెండు వారాల బ్యాటరీ బ్యాకప్​ అందిస్తుంది. పవర్ సేవింగ్ మోడ్​లో అయితే ఒకే ఛార్జింగ్​తో 38 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.


ఇది చూడండి...

First published:

Tags: Technology

ఉత్తమ కథలు