HOME »NEWS »TECHNOLOGY »huami amazfit gts 2 mini set to arrive in december mk gh

Huami Amazfit smartwatch: మార్కెట్లోకి అతి తక్కువ ధరలో స్మార్ట్ వాచ్...ధర ఎంతంటే...

Huami Amazfit smartwatch: మార్కెట్లోకి అతి తక్కువ ధరలో స్మార్ట్ వాచ్...ధర ఎంతంటే...
ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ Huami Amazfit Nio పేరుతో smartwatchలను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, అదే కంపెనీ అమేజ్‌ఫిట్ జిటిఎస్2 మినీ పేరుతో మరో స్మార్ట్ వాచ్ ను డిసెంబర్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

  • Share this:
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్ లు, ఫిట్ నెస్ బ్యాండ్లు సందడి చేస్తున్నాయి. గ్యాడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలు పోటాపోటీగా తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ Huami Amazfit Nio పేరుతో smartwatchలను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, అదే కంపెనీ అమేజ్‌ఫిట్ జిటిఎస్2 మినీ పేరుతో మరో స్మార్ట్ వాచ్ ను డిసెంబర్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను మొదటగా చైనాలో అందుబాటులోకి తేనుంది.

ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా చైనాలో వాడే వీబోలో పేర్కొన్న పోస్ట్ ప్రకారం, హువామి డిసెంబర్లో లాంచ్ చేయబోయే Amazfit GTS 2 mini smartwatch చిన్నదిగా, సన్నగా ఉంటుంది. ఇది హువామి అమేజ్ఫిట్ జిటిఎస్ 2 కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. తాజాగా అమేజ్‌ఫిట్ జిటిఎస్ 2 మినీ ఎఫ్‌సిసిలో జాబితా చేర్చబడింది. దీని ఫీచర్లు కూడా Amazfit GTS 2 మాదిరిగానే ఉంటాయి. దీనిలో కూడా చతురస్త్రాకారపు డయల్(రెట్రో) డిజైన్, నేవిగేషన్ బటన్, వాటర్ రెసిస్టెంట్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, వాటర్ రెసిస్టెంట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.



అయితే, దీని పరిమాణం Amazfit   జిటిఎస్ కంటే చాలా చిన్నగా ఉండనుంది. ఈ వాచ్ కేసు కుడి వైపున ఒక బటన్‌ను చేర్చింది. దీనిలో కూడా GTS 2 లో లభ్యమయ్యే AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది.

మూడు కలర్ వేరియంట్లలో లభ్యం..

Amazfit GTS 2 మినీ బ్లాక్, గ్రీన్, పింక్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్, హార్ట్ రేట్ సెన్సార్ తో వస్తుంది. హువామి సంస్థ జిటిఎస్ 2 మినీ ప్రత్యేకతల గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, ఇది జిటిఎస్ 2 మాదిరిగానే కొన్ని ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అమేజ్‌ఫిట్ జిటిఎస్ 2 smartwatch 1.65- అంగుళాల డిస్‌ప్లేతో పాటు పిక్సెల్ డెన్సిటీ 341 పిపిఐ, 450 నిట్‌ ప్రకాశవంతమైన డిస్ ప్లేతో వస్తుంది. అంతేకాక, దీనిలో 246 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చనున్నారు. దీన్ని ఒక్క సారి చార్జ్ చేస్తే స్టాండ్‌బై మోడ్‌లో ఒక వారం నుంచి 20 రోజులు వరకు పనిచేస్తుంది. అంతేకాక, ఈ smartwatch 12 స్పోర్ట్స్ మోడ్‌లతో లభిస్తుంది. వీటిని 90 స్పోర్ట్స్ మోడ్ల వరకు విస్తరించవచ్చు. దీనిలో బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, 24/7 హార్ట్ రేట్ ట్రాకింగ్ ఫీచర్స్తో అందుబాటులో ఉంటాయి.

అంతేకాక, ఇది అంతర్నిర్మిత GPS, 4GB స్టోరేజ్ తో వస్తుంది. అబ్సిడియన్ బ్లాక్, స్ట్రీమర్ గోల్డ్, డాల్ఫిన్ గ్రే అనే మూడు అడిషనల్ కలర్స్లో కూడా ఈ smartwatch లభిస్తుంది.
Published by:Krishna Adithya
First published:November 28, 2020, 15:11 pm