HTC True Wireless Earbuds: 86 గంటల స్టాండ్‌బైతో హెచ్​టీసీ ట్రూ వైర్​లెస్​ ఇయర్ బడ్స్ ప్లస్ రిలీజ్

HTC True Wireless Earbuds: 86 గంటల స్టాండ్‌బైతో హెచ్​టీసీ ట్రూ వైర్​లెస్​ ఇయర్ బడ్స్ ప్లస్ రిలీజ్ (image: HTC)

HTC True Wireless Earbuds Plus | హెచ్‌టీసీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS Earbuds) ప్లస్ లాంఛ్ అయింది. ఈ ఇయర్‌బడ్స్ 86 గంటల స్టాండ్ బై టైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
భారత మార్కెట్​లో వైర్​లెస్​ ఇయర్​బడ్స్​కు (Wireless Earbuds) మంచి క్రేజ్​ ఏర్పడింది. కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితమవ్వడంతో వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో, అన్ని టెక్​ కంపెనీలు వరుసగా వైర్​లెస్​ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేస్తున్నాయి. తాజాగా, గ్లోబల్​ టెక్​ దిగ్గజం హెచ్​టీసీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్లస్​ను (HTC True Wireless Earbuds Plus) యూకే మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఈ సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్​ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఆటో-పెయిరింగ్ ఫీచర్, కాల్స్​ ఆన్సర్ చేయడానికి లేదా తిరస్కరించడానికి టచ్ కంట్రోల్స్​తో వస్తాయి. ఇవి​ రెండు విభిన్న కలర్​ ఆప్షన్లలో లభిస్తాయి. హెచ్​టీసీ ఇటీవలే హెచ్​టీసీ వివ్​ ఫ్లో అనే కొత్త వర్చువల్ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించింది.

Mi 11X Pro 5G: రూ.39,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపే... ఆఫర్ ఇంకొన్ని రోజులే

హెచ్​టీసీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్లస్ ధర


పాకెట్​లింట్​ నివేదిక ప్రకారం, హెచ్​టీసీ ట్రూ వైర్​లెస్​ ఇయర్​బడ్స్​ ప్లస్​ EUR 69 (సుమారు రూ. 6,000) ధర వద్ద లభిస్తుంది. హెచ్​టీసీ వివ్​ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్లు బ్లాక్​, వైట్​ అనే రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తాయి. అయితే, ప్రస్తుతానికి దీన్ని యూకే మార్కెట్​లోనే లాంచ్​ చేయగా.. భారత్​తో సహా ఇతర గ్లోబల్​ మార్కెట్​లో లాంచింగ్​పై స్పష్టత లేదు.

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25 వేల లోపు 10 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

హెచ్​టీసీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్లస్ స్పెసిఫికేషన్లు


హెచ్​టీసీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్లస్​లో ఇన్​బిల్ట్​ మైక్‌, యాంబియంట్ సౌండ్‌ కంట్రోల్​ చేయడానికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. కాల్స్​ లిఫ్ట్ చేయడానికి లేదా రిజక్ట్​ చేయడానికి వీటిలో టచ్ కంట్రోల్స్​ను చేర్చింది. ఇవి IPX5 రేటింగ్ గల వాటర్ రెసిస్టన్స్​తో వస్తాయి. ఈ ఇయర్‌బడ్స్​ మొత్తం 86 గంటల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తాయి.

ఏఎన్​సీ స్విచ్ ఆన్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ మైక్‌లను ఉపయోగించి మాట్లాడేటప్పుడు 4.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ అందిస్తాయి. అలాగే, ఏఎన్​సీ లేకుండా మ్యూజిక్​ ప్లే చేస్తున్నప్పుడు 5.5 గంటల బ్యాటరీ లైఫ్​ను అందిస్తాయి. గిజ్మోచైనా నివేదిక ప్రకారం, హెచ్​టీసీ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్లస్​ను సిలికాన్‌తో రూపొందించారు. ఇవి తేలికైన ఎర్గోనామిక్ డిజైన్ కలిగి ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published: