HTC Wildfire X: ఇండియాలో రిలీజైన 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్'... ధర రూ.9,999

HTC Wildfire X | 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' ఫోన్ కొన్నవారికి వొడాఫోన్, ఐడియా యూజర్లకు రూ.3,750 విలువైన రీఛార్జ్ కూపన్స్ లభిస్తాయి. మైవొడాఫోన్ లేదా మైఐడియా యాప్ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. 18 నెలల పాటు రోజుకు 0.5 జీబీ డేటా అదనంగా లభిస్తుంది.

news18-telugu
Updated: August 14, 2019, 2:19 PM IST
HTC Wildfire X: ఇండియాలో రిలీజైన 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్'... ధర రూ.9,999
HTC Wildfire X: ఇండియాలో రిలీజైన 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్'... ధర రూ.9,999
news18-telugu
Updated: August 14, 2019, 2:19 PM IST
హెచ్‌టీసీ సరికొత్త ఫోన్‌తో మరోసారి ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. మొదటి హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ స్మార్ట్‌ఫోన్ 384 ఎంబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 2.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో 2010లో రిలీజైంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999. వాటర్ డ్రాప్ నాచ్, పర్సనల్ సెక్యూరిటీ టూల్ మైబడ్డీ లాంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ కొన్నవారికి వొడాఫోన్, ఐడియా యూజర్లకు రూ.3,750 విలువైన రీఛార్జ్ కూపన్స్ లభిస్తాయి. మైవొడాఫోన్ లేదా మైఐడియా యాప్ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. 18 నెలల పాటు రోజుకు 0.5 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తుంది.
Loading...


హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.22 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ23
రియర్ కెమెరా: 12+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.12,999

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Update Mobile Number: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ మార్చేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి

Realme 5: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు... ఆగస్ట్ 20న రిలీజ్

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్

 
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...