Laptop: ఈ ల్యాప్‌టాప్‌ను 4జీ సిమ్ కార్డుతో వాడుకోవచ్చు

HP 14s Laptop | వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి 4జీ సిమ్ కార్డుతో ఉపయోగించుకునేలా సరికొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది హెచ్‌పీ. ప్రత్యేకతలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 8, 2020, 5:46 PM IST
Laptop: ఈ ల్యాప్‌టాప్‌ను 4జీ సిమ్ కార్డుతో వాడుకోవచ్చు
Laptop: ఈ ల్యాప్‌టాప్‌ను 4జీ సిమ్ కార్డుతో వాడుకోవచ్చు (image: HP India)
  • Share this:
మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే హెవ్లెట్ ప్యాకార్డ్-HP ఇటీవల లాంఛ్ చేసిన హెచ్‌పీ 14ఎస్ నోట్‌బుక్ ఓసారి చెక్ చేయండి. ఈ ల్యాప్‌టాప్ వాడుకోవాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా డాంగిల్ అవసరం లేదు. మీ దగ్గరున్న 4జీ సిమ్ కార్డుతో ఈ ల్యాప్‌టాప్‌ను వాడుకోవచ్చు. 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో హెచ్‌పీ 14ఎస్ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది కంపెనీ. ఈ ల్యాప్‌టాప్‌లో స్టాండ్ బైగా 4జీ సిమ్ కార్డు వేసుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతంలో 4జీ డేటాతో ల్యాప్‌టాప్ ఉపయోగించొచ్చు. అంటే మీరు స్మార్ట్‌ఫోన్‌లో లేదా ట్యాబ్లెట్‌లో సిమ్ కార్డుతో 4జీ డేటా ఉపయోగించినట్టు ఈ ల్యాప్‌టాప్‌లో సిమ్ కార్డుతో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్, డాంగిల్ అవసరం లేదు. ఏ నెట్వర్క్ సిమ్ కార్డు అయినా పనిచేస్తుంది. 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి, ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి ఈ ల్యాప్‌టాప్ బాగా ఉపయోగపడుతుంది.

4K Smart TV: రూ.24,999 ధరకే 4కే స్మార్ట్ టీవీ... చైనా కంపెనీ కాదు

BSNL: ఇంటికి ఇంటర్నెట్ కావాలా? బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇదే

హెచ్‌పీ 14ఎస్ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ.44,999. స్పెసిఫికేషన్స్ చూస్తే ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ కెపాసిటీతో ఉంటుంది. ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ ప్రాసెసర్‌తో 8 జీబీ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇంటెల్ ఎక్స్ఎంఎం 7360 4జీ ఎల్‌టీఈ6, 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 41Wh లిథియం అయాన్ బ్యాటరీ, బ్లూటూత్ v5.0, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ సీపోర్ట్, రెండు యూఎస్‌బీ టైప్-ఏ పోర్ట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 1టీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో కొనొచ్చు. 4జీ సిమ్ కార్డు కోసం ప్రత్యేకంగా సిమ్ కార్డు స్లాట్ కూడా ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 5:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading