• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • HP LAUNCHES CHEAPEST LAPTOP HP CHROMEBOOK 11A WITH TOUCHSCREEN FOR STUDENTS SS GH

HP Chromebook: ఆన్‌లైన్ క్లాసుల కోసం తక్కువ ధరలో టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్

HP Chromebook: ఆన్‌లైన్ క్లాసుల కోసం తక్కువ ధరలో టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్

HP Chromebook: ఆన్‌లైన్ క్లాసుల కోసం తక్కువ ధరలో టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ (ప్రతీకాత్మక చిత్రం)

HP Chromebook 11a | ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? హెచ్‌పీ తక్కువ ధరలో క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ లాంఛ్ చేసింది.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రభావంత ోవిద్యార్థులు ఆన్‌లైన్ విధానంలోనే క్లాసులు వింటున్నారు. స్కూళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత విద్యార్థుల కోసం HP కంపెనీ తక్కువ ధరలో లభించే క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. HP Chromebook 11a పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.21,999 ప్రారంభ ధరలో ఇది లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. 11.6 అంగుళాల HD టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే, కన్వర్టబుల్ ఫోర్మ్ ఫ్యాక్టర్‌తో దీన్ని అభివృద్ధి చేశారు. క్రోమ్‌బుక్‌ 11a డివైజ్ మీడియాటెక్ MT8183 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ప్రైమరీ తరగతుల విద్యార్థుల కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లు హెచ్‌పీ సంస్థ ప్రకటించింది.

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

క్రోమ్‌బుక్ 11aను నోట్‌బుక్ లేదా టాబ్లెట్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంట్లో ఉండే టచ్ సపోర్ట్ HD IPS మానిటర్ మంచి పనితీరును ప్రదర్శిస్తుంది. ఇంటిగ్రేటెడ్ మీడియాటెక్ గ్రాఫిక్స్‌తో లభించే ఆక్టా కోర్ CPU, 4GB DDR4 ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో ల్యాప్‌టాప్ లభిస్తోంది. ఎస్‌డీ కార్డుతో 256GB వరకు స్టోరేజీని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇది హై ఎండ్ కంప్యూటర్ కాదు. కానీ పాఠశాల విద్యార్థుల అన్ని అవసరాలకు ఇది పూర్తిగా సరిపోతుంది. ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్లాస్ రూమ్, ఇతర టీచింగ్, లెర్నింగ్‌ యాప్‌లు కూడా ఉంటాయి.

Samsung Galaxy F12: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, ఎఫ్02ఎస్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

Jio Cricket plans: ఐపీఎల్ స్పెషల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే

ఆకట్టుకునే ఫీచర్లు


HP క్రోమ్‌బుక్ మెరుగైన బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసి 16 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. USB-A పోర్ట్, USB-C పోర్ట్, మైక్రో ఎస్‌డీ కార్డ్, 3.5mm హెడ్ ఫోన్ జాక్.. వంటి ఫీచర్లు దీని సొంతం. 4GB + 64GB విభాగంలో ఇంత తక్కువలో టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌ లభించడం చాలా అరుదు. భారత్‌లో ప్రముఖ కంపెనీలు ఏవీ ఈ విభాగంలో ఇంత తక్కువ ధరల్లో నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌లను అందించట్లేదు. మన దేశంలో హెచ్‌పీ క్రోమ్‌బుక్ 11a ధరను రూ.21,999గా నిర్ణయించారు. విద్యార్థులతో పాటు సాధారణ అవసరాలకు, మొదటిసారి ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్‌లో లభించే ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంది.
Published by:Santhosh Kumar S
First published: